జోర్డాన్‌ బూట్లు అ‘ధర’హో...

19 May, 2020 02:56 IST|Sakshi

వేలంలో రూ. 4 కోట్ల 25 లక్షలు వెచ్చించి కొనుగోలు

న్యూయార్క్‌: బాస్కెట్‌బాల్‌ దిగ్గజం మైకేల్‌ జోర్డాన్‌ వేసుకున్న బూట్లు వేలంలో రికార్డు ధర పలికాయి. ఎన్‌బీఏలో ఆడేందుకు జోర్డాన్‌ కోసమే ప్రత్యేకంగా నైకీ సంస్థ తయారు చేసిన ‘ఎయిర్‌ జోర్డాన్‌ స్నీకర్స్‌’ షూస్‌కు 5 లక్షల 60 వేల అమెరికా డాలర్లు (రూ.4 కోట్ల 25 లక్షలు) లభించాయి. ఇది ఆల్‌టైమ్‌ రికార్డు ధర అని వేలం నిర్వహించిన  ‘సొ ద బై’ సంస్థ వెల్లడించింది. 1985లో తెలుపు, నలుపు, ఎరుపు రంగుల్లో నైకీ ఈ బూట్లను ప్రత్యేకంగా తయారు చేసింది. ఈ షూస్‌ను ఎన్‌బీఏ పోటీల్లో జోర్డాన్‌ ధరించాడు. గతంలో కూడా జోర్డాన్‌ బూట్లు వేలంలో అసాధారణ ధర పలికాయి. అప్పట్లో జోర్డాన్‌ కోసం తొలిసారిగా స్నీకర్స్‌ తరహా బూట్లను నైకీ రూపొందించింది. వాటిని గత ఏడాది వేలానికి పెట్టగా 4 లక్షల 37 వేల డాలర్లు (రూ. 3 కోట్ల 30 లక్షలు) లభించాయి. ఎన్‌బీఏలో చికాగో బుల్స్‌ తరఫున జోర్డాన్‌ మెరుపులపై ‘ది లాస్ట్‌ డాన్స్‌’ అనే డాక్యుమెంటరీ వచ్చింది. ఇది కూడా అతను ఆడే మ్యాచ్‌ల్లాగే బాగా పాపులర్‌ అయింది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు