ఆసీస్‌పై పాక్‌ గెలుపు : కైఫ్‌ ఒక దేశద్రోహి!

9 Jul, 2018 12:56 IST|Sakshi
టీమిండియా మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ కైఫ్‌

మహ్మద్‌ కైఫ్‌పై నెటిజన్ల ఆగ్రహం

ముక్కోణపు టీ20 సిరీస్‌లో భాగంగా ఆసీస్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌ ఫఖర్‌ జమాన్‌ (46  బంతుల్లో 91; 12 ఫోర్లు, 3 సిక్స్‌లు) కెరీర్‌ బెస్ట్‌ ఇన్నింగ్స్‌తో పాక్‌ను గెలిపించాడు. దీంతో ఆతిథ్య జింబాబ్వే, ఆస్ట్రేలియా జట్లతో జరిగిన ముక్కోణపు టీ20 సిరీస్‌లో పాకిస్తాన్‌ విజేతగా నిలిచింది. అయితే ఫఖర్‌ జమాన్‌ అద్భుత ఇన్నింగ్స్‌కు ఫిదా అయిన భారత మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ కైఫ్‌ అతడిపై ప్రశంసలు కురిపించాడు. 

‘ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో  పాక్‌ జట్టు అద్భుత విజయం సాధించింది. గ్రేట్‌ ఇన్నింగ్స్‌తో పాక్‌ విజయానికి కారణమైన ఫఖర్‌ జమాన్‌ బిగ్‌ మ్యాచ్‌ ప్లేయర్‌.. కంగ్రాచ్యులేషన్స్‌’  అంటూ కైఫ్‌ ట్వీట్‌ చేశాడు. ఈ ట్వీట్‌కు స్పందించిన నెటిజన్లు ‘దేశద్రోహి’ అంటూ కైఫ్‌పై విరుచుకుపడ్డారు. ‘పాకిస్తాన్‌ గెలిస్తే మీరు కూడా సంతోషపడతారా‘... ‘పాకిస్తాన్‌పై ఎంత ప్రేమ చూపిస్తున్నారో అయితే అక్కడే ఉండొచ్చుగా’  అంటూ విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు