వలలో అరుదైన చేపలు..దెబ్బతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మత్స్యకారుడు!

10 Nov, 2023 15:59 IST|Sakshi

చేపల వేటతో జీవనం సాగించే మత్స్యకారులకు ఒక్కోసారి అదృష్టం వరించి అరుదైన చేపలు వలలో చిక్కుతాయి. దీంతో లక్షాధికారులుగా మారిన పలు సందర్భాలు ఉన్నాయి. అలాంటి అదృష్టమే పాక్‌లోని ఓ మత్స్యకారుడిని వరించింది. దెబ్బతో ఒక్కరాత్రిలో ఊహించని రీతిలో అతని తలరాత మారిపోయింది. అతడికి లక్‌ అలా ఇలా లేదు. 

వివరాల్లోకెళ్తే...పాక్‌లోని కరాచీ నౌకాశ్రయం సమీపంలో ఉన్న అరేబియా సముద్రంలో చేపల వేటకు వెళ్లిన ఇబ్రహి హైదరీ వలలో అరుదైన చేపలు పడ్డాయి. ఆ చేపలను మాండలికంలో గోల్డెన్‌ ఫిష్‌, లేదా సోవా అని పిలుస్తారు. ఇవి చాలా అమూల్యమైనవి, అరుదుగా దొరుకుతాయి. వీటిలో మంచి ఔషధగుణాలు ఉండటంతో వైద్యంలో ప్రముఖంగా వాడతారు.  అలాగే వీటిలో దారం లాంటి పదార్థాన్ని శస్త్ర చికిత్స విధానాల్లో వినయోగిస్తారు. ఈ చేప ఒక్కొకటి ఏకంగా 7 మిలియన్లు(దాదాపు 70 లక్షలు) పలికాయి.

దీంతో మొత్తం చెప్పలు సుమారు రూ. 7 కోట్లకు అమ్ముడుపోయాయి. దీంతో అతను ఓవర్‌ నైట్‌లో  కోటీశ్వరుడు మారిపోయాడు. ఈ చేప సుమారు 20 నుంచి 40 కిలోల బరువు ఉండి దాదాపు 1.5 మీటర్ల వరకు పెరుగుతుంది. వీటిని స్థానిక వంటకాల్లోనే కాక ఔషధాల్లోనూ ఎక్కువుగా ఉపయోగిస్తారు.కాగా, ఇంత పెద్ద మొత్తంలో అమ్ముడుపోవడంతో మత్స్యకారుడు హైదరీ ఆనందానికి అవధులు లేవు. ఇవి సంతానోత్పత్తి కాలంలోనే తీరాని వస్తాయని, అప్పుడే వలకు చిక్కుతాయని చెబుతున్నాడు హైదర్‌. తాను ఈ సొమ్ముని తన సిబ్బందితో కలిసి పంచుకుంటానని ఆనందంగా చెబుతున్నాడు. ఏదైన టైం రావలిగానీ ఒక్క క్షణంలో మీ జీవితం అందనంత ఎత్తులోకి వెళ్లిపోతుందంటే ఇదే కదా!.

(చదవండి: పేషెంట్‌కి చికిత్స అందిస్తూ..అంతలో వైద్యుడు..)

మరిన్ని వార్తలు