ధోనీ దూకుడు వెనుక సీక్రెట్‌ ఇదే!

14 May, 2018 09:12 IST|Sakshi

ధోనీ ఫామ్‌లోకి రావడంపై కోచ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రస్తుత ఐపీఎల్‌లో మహేంద్రసింగ్‌ ధోనీ మళ్లీ చెలరేగి ఆడుతున్నాడు. ఒకప్పటి ధోనీని గుర్తుకుతెచ్చేలా అతని ఆటతీరు అభిమానుల్ని అబ్బురపరుస్తోంది. సూపర్‌ ఫామ్‌లో ఉన్న ధోనీ ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ఇప్పటివరకు చెన్నై సూపర్‌కింగ్స్‌ తరఫున 12  మ్యాచ్‌లు ఆడి.. 103.25 స్ట్రైక్‌రేటుతో 413 పరుగులు చేశారు. ఇందులు మూడు అర్ధసెంచరీలు ఉన్నాయి.

ధోనీ ఇలా ఒక్కసారిగా ఫామ్‌లోకి వచ్చి చెలరేగడానికి కారణం ఏమిటంటే సూపర్‌కింగ్స్‌ కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ ఆసక్తికర విషయాన్ని తెలిపాడు. సీఎస్కేలోని తోటి ఆటగాళ్లు కన్నా ఎంతో ముందే ధోనీ ట్రెయినింగ్‌ ప్రారంభించాడని, ఆ కటోర శ్రమ ఫలితమే ప్రస్తుత ఫామ్‌ అని ఫ్లెమింగ్‌ వివరించాడు. ‘మానసికంగా ఎంతో సన్నద్ధం కావడం వల్ల అనుకుంటా.. టోర్నమెంటుకు ముందు ధోనీ ఎంతో ప్రాక్టీస్‌ చేశాడు. మేం ఎవరం రాకముందు నుంచే చాలాకాలంగా అతను కటోరమైన ప్రాక్టీస్‌ చేశాడు. దృఢనిశ్చయంతో వివిధ రకాల బంతులను ఆడటం ప్రాక్టీస్‌ చేశాడు’ అని ఫ్లెమింగ్‌ వివరించాడు. సింగిల్స్‌ తీయడం కన్నా భారీ షాట్ల మీద ధోనీ ఎక్కువ ఫోకస్‌ చేశాడని, 100శాతం కమిట్‌మెంట్‌తో అతను భారీషాట్లు ఆడుతున్నాడని, పాజిటివ్‌ ఫుట్‌వర్క్‌తో అతను బ్యాటింగ్‌ చేస్తుండటం, అద్భుతంగా ఆడుతుండటం చూస్తుంటే.. అతని కటోరశ్రమను కొనియాడక తప్పదని ఫ్లెమింగ్‌ పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు