కేఎల్ రాహుల్ కు నో ఛాన్స్..!

1 Oct, 2017 16:05 IST|Sakshi

నాగ్ పూర్: టీమిండియాతో ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా ఇక్కడ ఆదివారం విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న చివరిదైన ఐదో వన్డేలో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఎప్పటిలాగే తొలుత బ్యాటింగ్ చేసేందుకు మొగ్గుచూపాడు. గత మ్యాచ్ లో ఆస్ట్రేలియా విజయం సాధించి తమ పరాజయాల రికార్డు బ్రేక్ వేసుకుంది. అదే సమమంలో టీమిండియా వరుస విజయాలకు కూడా ముగింపు పడింది. అయితే భారత్ తన టాప్ ర్యాంకును కోల్పోయే ప్రమాదంలో పడింది.  గత మ్యాచ్ లో పరాజయం చెందడంతో 119 రేటింగ్ పాయింట్లతో దక్షిణాఫ్రికాతో కలిసి భారత్ సంయుక్తంగా అగ్రస్థానంలో  కొనసాగుతోంది. ఒకవేళ ఐదో వన్డేలో టీమిండియాకు ఓటమి ఎదురైతే మాత్రం రెండో ర్యాంకుకు పరిమితం కావాల్సి వస్తుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా గెలిచిన పక్షంలోనే 120 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలుపుకుంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే సిరీస్ ను గెలిచిన విరాట్ సేన.. ఇక చివరి వన్డేలో గెలిచి టాప్ ర్యాంకును నిలుపుకోవడంపైనే దృష్టి పెట్టింది.

ఇదిలా ఉంచితే, ఈ సిరీస్ లో ఇప్పటివరకూ తుది జట్టులో చోటు దక్కించుకోని కేఎల్ రాహుల్ కు మరోసారి చుక్కెదురైంది. చివరి వన్డేలో సైతం రాహుల్ కు అవకాశం కల్పించలేదు. జట్టు ప్రాబబుల్స్ లో రాహుల్ ఉన్నప్పటికీ ఆడే అవకాశం రాలేదు. ఇదిలా ఉంచితే, గత మ్యాచ్ లో ఆడిన ఉమేశ్ యాదవ్, మొహ్మద్ షమీ, యజ్వేంద్ర చాహల్ లకు విశ్రాంతినిచ్చారు. వారి స్థానాల్లో బూమ్రా, భువనేశ్వర్, కల్దీప్ యాదవ్ లు తిరిగి జట్టులో చేరారు.మరొకవైపు ఆసీస్ తుది జట్టులోకి జేమ్స్ ఫాల్కనర్ తిరిగి చేరాడు. కేన్ రిచర్డ్ సన్ కు విశ్రాంతినిచ్చి ఫాల్కనర్ ను జట్టులో వేసుకున్నారు.

ఆస్ట్రేలియా తుది జట్టు: స్టీవ్ స్మిత్(కెప్టెన్), డేవిడ్ వార్నర్, అరోన్ ఫించ్, ట్రావిస్ హెడ్, హ్యాండ్ స్కాంబ్, స్టోనిస్, మాథ్యూవేడ్, జేమ్స్ ఫాల్కనర్, పాట్ కమిన్స్, కౌల్టర్ నైల్, ఆడమ్ జంపా

భారత తుది జట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ, అజింక్యా రహానే, హార్దిక్ పాండ్యా, కేదర్ జాదవ్, మనీష్ పాండే, ఎంఎస్ ధోని, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, బూమ్రా, కుల్దీప్ యాదవ్

మరిన్ని వార్తలు