కరోనా నుంచి కోలుకున్న పాక్‌ మాజీ క్రికెటర్‌ తౌఫిక్‌ 

6 Jun, 2020 03:27 IST|Sakshi

కరాచీ: పాకిస్తాన్‌ మాజీ ఓపెనర్‌ తౌఫీక్‌ ఉమర్‌ ప్రాణాంతక కరోనా వైరస్‌ నుంచి కోలుకున్నాడు. రెండు వారాల క్రితం వైరస్‌ బారిన పడిన తాను ప్రస్తుతం పూర్తిస్థాయిలో కోలుకున్నానని 38 ఏళ్ల తౌఫీక్‌ శుక్రవారం తెలిపాడు. కోవిడ్‌–19 మహమ్మారిని తీవ్రంగా పరిగణించాలని, రోగ నిరోధక శక్తికి పెంపొందించుకునే మార్గాలపై శ్రద్ధ వహించాలని అతను ప్రజలకు సూచించాడు. ‘ప్రతీ ఒక్కరూ సామాజిక దూరం పాటించండి. పాజిటివ్‌గా తేలాక రెండు వారాల పాటు నేను ఒక గదికే పరిమితమయ్యా. ఇంట్లో పిల్లలకు, పెద్దవారికి దూరంగా ఉన్నా. ఒకవేళ ఎవరైనా కరోనా పాజిటివ్‌గా తేలితే కంగారు పడకుండా రోగనిరోధకత పెంచుకోవడంపై దృష్టి పెట్టండి’ అని ఉమర్‌ పేర్కొన్నాడు. ప్రస్తుతం పాకిస్తాన్‌ జూనియర్‌ సెలక్షన్‌ కమిటీలో సభ్యుడైన ఉమర్‌.. 44 టెస్టులు, 22 వన్డేల్లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు