ఫైనల్లో ఫెడరర్‌  

17 Mar, 2019 01:35 IST|Sakshi

గాయంతో వైదొలిగిన నాదల్‌

కాలిఫోర్నియా: ఇండియన్‌  వెల్స్‌ ఓపెన్‌  మాస్టర్స్‌   సిరీస్‌–1000 టోర్నమెంట్‌ టైటిల్‌కు స్విట్జర్లాండ్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌ విజయం దూరంలో ఉన్నాడు. శనివారం జరగాల్సిన పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో ఫెడరర్‌కు ‘వాకోవర్‌’ లభించింది. ఫెడరర్‌తో సెమీఫైనల్లో తలపడాల్సిన స్పెయిన్‌  స్టార్‌ రాఫెల్‌ నాదల్‌ మోకాలి గాయం కారణంగా బరిలోకి దిగలేదు.

దాంతో ఫెడరర్‌ శ్రమించికుండానే ఫైనల్‌ బెర్త్‌ను దక్కించుకున్నాడు. క్వార్టర్‌ ఫైనల్స్‌లో ఐదుసార్లు చాంపియన్‌ ఫెడరర్‌ 6–4, 6–4తో హుబెర్ట్‌ హుర్కాజ్‌ (పోలాండ్‌)పై గెలుపొందగా... నాదల్‌ 7–6 (7/2), 7–6 (7/2)తో కరెన్‌  ఖచనోవ్‌ (రష్యా)ను ఓడించాడు. డొమినిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా), మిలోస్‌ రావ్‌నిచ్‌ (కెనడా) మధ్య జరిగే రెండో సెమీఫైనల్‌ విజేతతో ఫైనల్లో ఫెడరర్‌ ఆడతాడు.  

మరిన్ని వార్తలు