విండీస్‌ తడబాటు 

17 Jun, 2018 01:31 IST|Sakshi

సెయింట్‌ లూసియా: శ్రీలంకతో రెండో టెస్టులో వెస్టిండీస్‌ తడబడింది. మూడో రోజు ఆరంభంలోనే కీలకమైన స్మిత్‌ (61; 4 ఫోర్లు, 1 సిక్స్‌), హోప్‌ (19; 2 ఫోర్లు) వికెట్లను కోల్పోయింది. 123/2 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఆట కొనసాగించిన వెస్టిండీస్‌ కడపటి వార్తలందేసరికి తొలి ఇన్నింగ్స్‌లో 62 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 253 పరుగులు చేసింది.  
ఆట ఆలస్యంగా: మూడో రోజు ఆట రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది.

రెండో రోజు ఆట ముగిసే దశలో బంతి ఆకారం మారిందని సందేహించిన ఫీల్డు అంపైర్లు అలీమ్‌ దార్, ఇయాన్‌ గౌల్డ్‌ మూడో రోజు బంతిని మార్చేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని ఆటకు ముందే లంక కెప్టెన్‌ చండిమాల్‌కు చెప్పారు. దీంతో లంక జట్టు మైదానంలోకి దిగేందుకు ససేమిరా అనడంతో వివాదమైంది. ఈ దశలో మ్యాచ్‌ రిఫరీ జవగళ్‌ శ్రీనాథ్‌... లంక కోచ్‌ హతురుసింఘా, మేనేజర్‌ గురుసిన్హాలతో పలుమార్లు సంప్రదింపులు జరిపాక ఎట్టకేలకు లంకేయులు ఆడేందుకు సిద్ధమయ్యారు.  

మరిన్ని వార్తలు