‘నోటికి కాదు.. బ్యాటుకు పని చెప్పండి’

19 Dec, 2018 18:46 IST|Sakshi

పెర్త్‌: ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు అంటేనే స్లెడ్జింగ్‌కు పెట్టింది పేరు. తరం మారినా వారి మైండ్‌ సెట్‌ మారలేదు. ఎన్ని వివాదాలు చుట్టు ముట్టినా తాము ఆటకంటే ఎక్కువగా మాటలకే ప్రాధాన్యత ఇస్తామనే భావన వారికి ఉంది. తాజాగా పెర్త్‌ వేదికగా ఆసీస్‌-టీమిండియాల మధ్య జరిగిన రెండో టెస్టులో ఇరుజట్ల సారథుల మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. మ్యాచ్‌ అనంతరం ఆటలో ఇవి సహజమంటూ ఆసీస్‌ క్రికెటర్లు తీసిపారేయడం ఎవ్వరికీ రుచించడం లేదు. దీనిపై ఇప్పటికే మాజీ క్రికెటర్లు ఆగ్రహించిన విషయం తెలిసిందే. తాజాగా ఆసీస్‌ మాజీ సారథి రికీ పాంటింగ్‌ ఈ వివాదంపై స్పందించాడు. (కోహ్లిసేన ఓటమికి కారణాలివేనా?)

‘మీ తెలివితేటలను మాటలకే ఉపయోగిస్తున్నారు.. కానీ ఆటకు ఉపయోగించటం లేదు. మీరు అద్వితీయమైన ఆటతీరును ప్రదర్శిస్తే ప్రత్యర్థి జట్లలోని ఆటగాళ్లు ఎలాంటి ఆలోచన లేకుండా అభినందిస్తారు. మైదానంలో బ్యాటు, బంతి మాత్రమే మాట్లాడుకోవాలి. చక్కటి నైపుణ్యంతో మీరు ఆడుతుంటే ప్రత్యర్థి ఆటగాళ్లు అయోమయంలో ఉండటాన్ని  ఆనందించవచ్చు. మిమ్మల్ని ఎదుర్కోవడానికి ప్రత్యర్థి జట్టు వేసే వ్యూహాలు, ఫీల్డింగ్‌, బౌలింగ్‌ మార్చుతుంటే ఆ ఆనందం వర్ణనాతీతం.. అలాంటివి ఆస్వాదించండి’ అంటూ ఆటగాళ్లకు పాంటింగ్‌ సూచించాడు. (కోహ్లిపై ఆసీస్‌ బౌలర్‌ పరుష వ్యాఖ్యలు!)

మరిన్ని వార్తలు