World Cup 2023: ఒమర్జాయ్ అద్భుత ఇన్నింగ్స్‌.. దక్షిణాఫ్రికా టార్గెట్‌ 245 పరుగులు

10 Nov, 2023 18:16 IST|Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023లో అహ్మదాబాద్‌ వేదికగా దక్షిణాఫ్రికా, అఫ్గానిస్తాన్‌ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన అఫ్గానిస్తాన్‌ 50 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటైంది. అఫ్గాన్‌ బ్యాటర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ అద్బుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. ఓ వైపు క్రమం తప్పకుండా వికెట్లు పడతున్నప్పటికీ ఒమర్జాయ్‌ ఆచితూచి ఆడి తన జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించాడు.

అయితే తృటిలో తన తొలి అంతర్జాతీయ సెంచరీ చేసే అవకాశాన్ని ఒమర్జాయ్ కోల్పోయాడు. 107 బంతులు ఎదుర్కొన్న  ఒమర్జాయ్ 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 97 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు నూర్‌ అహ్మద్‌(26),రెహమత్‌ షా(26) పరుగులతో రాణించారు. ప్రోటీస్‌ బౌలర్లలో పేసర్‌ గెరాల్డ్ కోయెట్జీ 4 వికెట్లతో చెలరేగగా.. కేశవ్‌ మహారాజ్‌, ఎంగిడి తలా వికెట్‌ సాధించారు.
చదవండి: వరల్డ్‌కప్‌ జరుగుతుండగా టీమిండియా క్రికెటర్‌ రిటైర్మెంట్‌..!

మరిన్ని వార్తలు