మూడు ఫార్మాట్లలో రోహిత్‌ శర్మనే కింగ్‌..

5 Oct, 2019 15:17 IST|Sakshi

విశాఖ: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో ఓపెనర్‌గా అవతారమెత్తిన టీమిండియా ఆటగాడు రోహిత్‌ శర్మ పరుగుల మోతతో పాటు రికార్డుల వేటను కూడా కొనసాగిస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో మయాంక్‌ అగర్వాల్‌తో కలిసి ఒక టెస్టు మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డును లిఖించిన రోహిత్‌ శర్మ.. తాజాగా వ్యక్తిగతంగా ఒక టెస్టు మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డును సొంతం చేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు సిక్సర్లు కొట్టిన రోహిత్‌.. రెండో ఇన్నింగ్స్‌లో మూడో సిక్స్‌ సాధించిన తర్వాత అరుదైన రికార్డును లిఖించాడు. ఒక టెస్టు మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాడిగా ఘనతను సాధించాడు.(ఇక్కడ చదవండి: రోహిత్‌ మళ్లీ మెరిశాడు..)

ఈ క్రమంలోనే 25 ఏళ్ల క్రితం నవ్‌జ్యోత్‌ సింగ్‌ సిద్ధూ నెలకొల్పిన రికార్డును బ్రేక్‌ చేశాడు రోహిత్‌ శర్మ. 1994లో ఒక మ్యాచ్‌లో సిద్ధూ ఎనిమిది సిక్సర్లు కొట్టాడు. అది ఇప్పటివరకూ భారత్‌ తరఫున పదిలంగా ఉండగా దాన్ని రోహిత్‌ బ్రేక్‌ చేశాడు.  నాల్గో రోజు ఆట టీ బ్రేక్‌ సమయానికి రోహిత్‌ రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు సిక్సర్లు సాధించాడు. దాంతో ఒక మ్యాచ్‌లో 10 సిక్సర్లను రోహిత్‌ కొట్టాడు. ఇదిలా ఉంచితే,  మూడు ఫార్మాట్లలో భారత్‌ తరఫున ఒక మ్యాచ్‌లో అత్యధిక వ్యక్తిగత సిక్సర్ల కొట్టిన ఘనత రోహిత్‌ పేరిట లిఖించబడింది.  వన్డేల్లో 16 సిక్సర్లు సాధించిన రోహిత్‌.. అంతర్జాతీయ టీ20ల్లో 10 సిక్సర్లు సాధించాడు. ఫలితంగా మూడు ఫార్మాట్లలో భారత్‌ నుంచి ఒక​ మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డును నెలకొల్పాడు.( ఇక్కడ చదవండి: ‘హాఫ్‌ సెంచరీ’లో 9 ఫోర్లు.. 1 సిక్స్‌

>
మరిన్ని వార్తలు