‘అంతా సైనా నిర్ణయమే’

15 Jan, 2020 03:28 IST|Sakshi

ప్రకాశ్‌ పదుకొనే అకాడమీ వివరణ

న్యూఢిల్లీ: ఐదేళ్ల క్రితం తన అకాడమీని వదిలి సైనా నెహ్వాల్‌ బెంగళూరు వెళ్లిపోవడం తనను తీవ్రంగా బాధించిందని... ప్రకాశ్‌ పదుకొనే, విమల్‌ కుమార్‌ ఆమెకు నచ్చజెప్పి ఉండాల్సిందని భారత బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ చేసిన వ్యాఖ్యలపై ప్రకాశ్‌ పదుకొనే బ్యాడ్మింటన్‌ అకాడమీ (పీపీబీఏ) స్పందించింది. సైనా తన ఇష్ట్రపకారమే వ్యవహరించింది తప్ప తమ పాత్ర ఏమీ లేదని ఒక ప్రకటన ద్వారా వివరణ ఇచి్చంది. ‘గోపీచంద్‌ అకాడమీని వదిలి పీపీబీఏలో శిక్షణ పొందాలనేది పూర్తిగా సైనా నెహా్వల్‌ సొంత నిర్ణయం. అందులో మా పాత్ర అసలేమాత్రం లేదు. అయితే కష్టకాలంలో విమల్‌ కుమార్‌ కోచింగ్‌ ఆమెకు ఉపకరించిందనేది వాస్తవం.

ఆయన మార్గనిర్దేశనంలోనే సైనా వరల్డ్‌ నంబర్‌వన్‌గా నిలవడంతో పాటు ఆల్‌ ఇంగ్లండ్, ప్రపంచ చాంపియన్‌ షిప్‌లలో ఫైనల్‌ వరకు వెళ్లగలిగింది. ఆటగాడిగా, కోచ్‌గా గోపీచంద్‌ ఘనతలపై మాకు అపార గౌరవం ఉంది. ఆయన దగ్గర శిక్షణ పొందిన వారు మంచి ఫలితాలు సాధించినప్పుడు అభినందించాం. ఆయనతో మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. గత 25 ఏళ్లుగా పీపీబీఏ షట్లర్లను తీర్చిదిద్దుతోంది. వారిని ప్రోత్సహించడమే తప్ప కెరీర్‌లో వేర్వేరు దశల్లో ఎక్కడైనా వెళ్లిపోతామంటే ఎప్పుడూ ఆపలేదు. అది మా విధానం కూడా. అంతర్జాతీయ ప్రొఫెషనల్‌ క్రీడాకారుల కెరీర్‌ చాలా చిన్నది. తమ లక్ష్యాలు చేరుకునే క్రమంలో దక్కిన అవకాశాలను సరిగ్గా ఉపయోగించుకోవడం ముఖ్యం కాబట్టి ఏం చేయాలనేది ఆటగాళ్లే నిర్ణయించుకోవాలి’ అని పీపీబీఏ స్పష్టం చేసింది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు