మీ నమ్మకాన్ని నిలబెడతా: స్టీవ్‌ స్మిత్‌ 

5 May, 2018 01:12 IST|Sakshi

మెల్‌బోర్న్‌: బాల్‌ ట్యాంపరింగ్‌ ఉదంతంతో ఏడాది నిషేధానికి గురైన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ తిరిగి దేశప్రజల నమ్మకం పొందడానికి కృషి చేస్తానంటున్నాడు. నిషేధం అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన స్మిత్‌ స్వదేశానికి చేరుకున్నట్లు తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా తెలిపాడు. ‘స్వదేశం చేరుకోవడం చాలా సంతోషంగా ఉంది. బయట కొంత సమయం విశ్రాంతి తీసుకున్నా. ఆ సమయంలో నాకోసం ఎన్నో ఈ–మెయిల్స్, లెటర్స్‌ వచ్చాయి.

మీరు నాపై చూపిన ప్రేమకు కృతజ్ఞతలు. తిరిగి మీ నమ్మకాన్ని గెలిచేందుకు కృషిచేస్తాను’ అని స్మిత్‌ పేర్కొన్నాడు.  దక్షిణాఫ్రికాలో జరిగిన మూడో టెస్టులో బాల్‌ ట్యాంపరింగ్‌ చేసినట్లు రుజువవడంతో క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) స్మిత్, వార్నర్‌లపై ఏడాది.. బాన్‌క్రాఫ్ట్‌పై తొమ్మిది నెలల నిషేధం విధించిన విషయం తెలిసిందే.  ఇప్పుడు తాజాగా తన భవిష్యత్‌ గురించి  స్మిత్‌ పెదవి విప్పాడు.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు