టీమిండియాకు నిండైన ప్రాక్టీస్‌

19 Aug, 2019 06:08 IST|Sakshi

సెంచరీ బాదిన చతేశ్వర్‌ పుజారా

రాణించిన ఇషాంత్, ఉమేశ్, కుల్దీప్‌

కూలిడ్జ్‌ (అంటిగ్వా): కరీబియన్‌ పర్యటనలో టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియాకు బ్యాటింగ్, బౌలింగ్‌ విభాగాల్లో సరైన ప్రాక్టీస్‌ లభించింది. వెస్టిండీస్‌ ‘ఎ’తో ఇక్కడ జరుగుతున్న మూడు రోజుల మ్యాచ్‌లో మన జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. కీలక బ్యాట్స్‌మన్‌ పుజారా (187 బంతుల్లో 100 రిటైర్డ్‌ నాటౌట్‌; 8 ఫోర్లు, సిక్స్‌) సెంచరీ; తెలుగు ఆటగాడు హనుమ విహారి (101 బంతుల్లో 37 నాటౌట్‌; 2 ఫోర్లు); రిషభ్‌ పంత్‌ (53 బంతుల్లో 33; 4 ఫోర్లు, సిక్స్‌)రాణించడంతో భారత్‌ తొలి రోజు శనివారం 5 వికెట్ల నష్టానికి 297 పరుగులు చేసింది. ఇదే స్కోరు వద్ద డిక్లేర్‌ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభిం చిన విండీస్‌ ‘ఎ’ను పేసర్లు ఇషాంత్‌ శర్మ (3/21), ఉమేశ్‌ యాదవ్‌ (3/19); స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ (3/35) కుప్పకూల్చారు. దీంతో ప్రత్యర్థి టీ విరామానికి ముందు 56.1 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టులో ఓపెనర్‌ హడ్జ్‌ (51) అర్ధసెంచరీ సాధించాడు. భారత్‌కు 116 పరుగుల ఆధిక్యం లభించింది.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రోహిత్‌కు చిర్రెత్తుకొచ్చిన వేళ..

రెండేళ్ల వేతనాన్ని విరాళంగా ఇచ్చిన గంభీర్‌

‘ట్రంప్‌లాగే ఆలోచించవద్దు.. ప్రాణాలే ముఖ్యం’

వేలానికి బట్లర్‌ ప్రపంచకప్‌ జెర్సీ

హాకీ ఇండియా, ఏఐఎఫ్‌ఎఫ్‌ విరాళం రూ. 25 లక్షలు

సినిమా

‘బాహుబలి’ని బ్రేక్‌ చేసిన మహేశ్‌ చిత్రం

ఆ బికినీ ఫొటోకు అంత ఎడిటింగ్ ఎందుకు?

చేదు అనుభవాలు ఎదుర్కొంటున్నా: హీరోయిన్‌

వైర‌ల్ అవుతున్న క‌రోనా సాంగ్‌

‘చౌరస్తా’నుంచి మరో సాంగ్‌.. బాహుబలినై

వారి పెళ్లి పెటాకులేనా?!