విజేతకు ఇంకా డబ్బులు అందలేదు! 

23 Oct, 2018 00:29 IST|Sakshi

ముంబై: పుష్కర కాలం తర్వాత విజయ్‌ హజారే ట్రోఫీని గెలుచుకున్న ముంబై జట్టు సభ్యులకు ఇప్పటి వరకు టోర్నీకి సంబంధించిన ఒక్క రూపాయి కూడా లభించలేదు. ముంబై క్రికెట్‌ సంఘం (ఎంసీఏ)లో పరిపాలన స్తంభించిపోవడంతో వారికి ఈ పరిస్థితి ఎదురైంది. నిబంధనల ప్రకారం బీసీసీఐ నేరుగా ఆటగాళ్లకు డబ్బు లు ఇవ్వకుండా సదరు సంఘం ద్వారానే చెల్లింపులు జరుపుతుంది. ఒక్కో ఆటగాడికి రోజూవారీ భత్యం కింద రూ.1500 లభిస్తుంది.

దాదాపు నెల రోజులు సాగిన ఈ టోర్నీ ద్వారా ఒక్కో ఆటగాడికి రూ. 45 వేల వరకు రావాల్సి ఉంది. విజేతగా నిలిచిన జట్టుకు లభించే రూ. 20 లక్షల ప్రైజ్‌మనీ కూడా ముంబై ఆటగాళ్లకు దక్కలేదు. దీంతో పాటు 11 మ్యాచ్‌లు ఆడిన ముంబై ఆటగాళ్లకు ఒక్కో మ్యాచ్‌ ఫీజు కింద రూ. 35 వేల వంతున కూడా ఇవ్వాల్సి ఉంది. ఎంసీఏలో చెక్‌లపై సంతకం పెట్టే అధికారం కూడా ప్రస్తుతం ఎవరికీ లేకపోవడంతో ఆటగాళ్లు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.    

మరిన్ని వార్తలు