బుమ్రాను ఆట పట్టించిన మహిళా క్రికెటర్‌

31 Oct, 2019 17:54 IST|Sakshi

లండన్‌:  వెన్ను గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌కు దూరమైన టీమిండియా ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా కోలుకుంటున్నాడు.   న్యూజిలాండ్‌తో డిసెంబర్‌లో జరుగనున్న ద్వైపాక్షిక సిరీస్‌ నాటికి బుమ్రా గాడిలో పడే అవకాశం కనబడుతోంది. దీనిలో భాగంగా జిమ్‌లో బుమ్రా ప్రాక్టీస్‌ చేస్తున్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. టీమిండియా జట్టుతో త్వరలోనే జాయిన్‌ అవుతా అనే అర్థం వచ్చేలా ‘కమింగ్‌ సూన్‌’ అంటూ తన ఫోటోకు క్యాప్షన్‌ జత చేశాడు.

దీనిపై  ఇంగ్లండ్‌ మహిళా క్రికెటర్‌ డానియెల్లి యాట్‌ తనదైన శైలిలో స్పందించారు. ఎప్పుడు విరాట్‌ కోహ్లి, ఎంఎస్‌ ధోనిల గురించి ఎక్కువగా సోషల్‌ మీడియాలో కామెంట్లు చేసే యాట్‌.. ఈసారి బుమ్రా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన కమింగ్‌ సూన్‌ కామెంట్‌పై ఫన్నీగా రిప్లై ఇచ్చారు. బుమ్రా వెయిట్‌ లిఫ్టింగ్‌ ఎక్సర్‌సైజ్‌లను ప్రస్తావిస్తూ చిన్న పిల్లలు చేసే ఎక్సర్‌సైజ్‌లు చేస్తున్నావా అంటూ చమత్కరించారు. అవి బేబీ వెయిట్స్‌ కదా అంటూ బుమ్రాను ఆట పట్టించారు.

గత కొన్ని రోజుల క్రితం బుమ్రా గాయానికి శస్త్ర చికిత్స అవసరమని భావించినా అది అవసరం కాలేదు.  ప్రస్తుతం తేలికపాటి ఎక్స్‌ర్‌సైజులు చేస్తున్నాడు బుమ్రా.  అదే సమయంలో రన్నింగ్‌ ప్రాక్టీస్‌ను కూడా తన దినచర్యలో భాగం చేశాడు.  ఈ మేరకు బెంగళూరులోని క్రికెటర్ల పునరావస కేంద్రం నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ(ఎన్‌సీఏ)లో బమ్రా శిక్షణ తీసుకుంటున్నాడు. అక్కడ జిమ్‌లో ఎక్స్‌ర్‌సైజ్‌లో చేస్తూ తీసుకున్న ఫొటోను బుమ్రా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. దానికి కమింగ్‌ సూన్‌ అనే క్యాప్షన్‌ ఇచ్చాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా