యతిన్‌ రెడ్డి, భగత్‌ వర్మ సెంచరీలు

29 Jun, 2018 10:28 IST|Sakshi

ఇన్‌కంట్యాక్స్‌తో దయానంద్‌ సీసీ మ్యాచ్‌ డ్రా

మూడు రోజుల క్రికెట్‌ లీగ్‌

సాక్షి, హైదరాబాద్‌: దయానంద్‌ సీసీ బ్యాట్స్‌మెన్‌ యతిన్‌ రెడ్డి (262 బంతుల్లో 170; 20 ఫోర్లు, 6 సిక్సర్లు), భగత్‌వర్మ (234 బంతుల్లో 148; 20 ఫోర్లు, 3 సిక్సర్లు) బాధ్యతాయుత సెంచరీలతో ఆకట్టుకున్నారు. వీరిద్దరూ ఓపికగా ఆడటంతో హెచ్‌సీఏ ఎ–1 డివిజన్‌ మూడు రోజుల లీగ్‌లో భాగంగా ఇన్‌కంట్యాక్స్‌ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో దయానంద్‌ సీసీ తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యాన్ని దక్కించుకుని మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 228/6తో మూడోరోజు తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన దయానంద్‌ సీసీ గురువారం ఆటముగిసే సమయానికి 143 ఓవర్లలో 9 వికెట్లకు 558 పరుగులతో నిలిచింది. యతిన్, భగత్‌వర్మ రోజంతా క్రీజులో నిలబడి జట్టుకు ఆధిక్యాన్ని అందించారు.

వీరిద్దరూ ఎనిమిదో వికెట్‌కు 320 పరుగుల్ని జోడించారు. తొలుత ఇన్‌కంట్యాక్స్‌ జట్టు 556 పరుగులకు ఆలౌటైంది. 2 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యాన్ని సాధించిన దయానంద్‌ సీసీ జట్టుకు 3 పాయింట్లు లభించగా, ఇన్‌కంట్యాక్స్‌ జట్టు ఖాతాలో ఒక పాయింట్‌ చేరింది. ఈ మ్యాచ్‌లో దయానంద్‌ సీసీ తరఫున అన్షుల్‌ (100), వై. చైతన్య కృష్ణ (104), యతిన్‌రెడ్డి, భగత్‌వర్మ సెంచరీలు చేశారు. దీపాన్‌‡్ష బుచర్, పి. రోహిత్‌ రెడ్డి, సలీమ్‌ షేక్‌ డకౌట్‌లుగా వెనుదిరిగారు.  

ఇతర మ్యాచ్‌ల ఫలితాలు

గ్రూప్‌ ‘ఎ’: ఎస్‌సీఆర్‌ఎస్‌ఏ తొలి ఇన్నింగ్స్‌: 364, రెండో ఇన్నింగ్స్‌: 65/1 (వంశీకృష్ణ 32 నాటౌట్‌); జై హనుమాన్‌ తొలి ఇన్నింగ్స్‌: 165 (కమ్రుద్దీన్‌ 3/17, బి. సుధాకర్‌ 3/12).

బీడీఎల్‌ తొలి ఇన్నింగ్స్‌: 232, రెండో ఇన్నింగ్స్‌: 137 (టి. సంతోష్‌ 48; కనిష్క్‌ నాయుడు 6/42), ఆంధ్రాబ్యాంక్‌ తొలి ఇన్నింగ్స్‌: 320, రెండో ఇన్నింగ్స్‌: 51/1 (9.1 ఓవర్లలో).

ఎస్‌బీఐ తొలి ఇన్నింగ్స్‌: 342, రెండో ఇన్నింగ్స్‌: 313/6 డిక్లేర్డ్‌ (డానీ డెరెక్‌ ప్రిన్స్‌ 84, ఆకాశ్‌ భండారి 115), ఈఎంసీసీ తొలి ఇన్నింగ్స్‌: 244.  

గ్రూప్‌ ‘బి’

ఏఓసీ తొలి ఇన్నింగ్స్‌: 436; రెండో ఇన్నింగ్స్‌: 118/6 డిక్లేర్డ్‌ (రాహుల్‌ 49 నాటౌట్‌; వి. సాత్విక్‌ రెడ్డి 4/50), కేంబ్రిడ్జ్‌ ఎలెవన్‌ తొలి ఇన్నింగ్స్‌: 116, రెండో ఇన్నింగ్స్‌: 226 ( పి. నీలేశ్‌ 65; దివేశ్‌ పథానియా 4/55).

ఎవర్‌గ్రీన్‌ తొలి ఇన్నింగ్స్‌: 610/6; ఎంపీ కోల్ట్స్‌ తొలి ఇన్నింగ్స్‌: 290, రెండో ఇన్నింగ్స్‌: 159/3 (వైష్ణవ్‌ రెడ్డి 66, అసదుద్దీన్‌ 71 నాటౌట్‌).
∙ఎన్‌స్కాన్స్‌ తొలి ఇన్నింగ్స్‌: 393, రెండో ఇన్నింగ్స్‌: 163/1 (ఓవైస్‌ 61 నాటౌట్, జునైద్‌ అలీ 95), కాంటినెంటల్‌ సీసీ తొలి ఇన్నింగ్స్‌: 263/9 డిక్లేర్డ్‌ (వై. అనిరుధ్‌ రెడ్డి 108, సంకీర్త్‌ 61; అజహరుద్దీన్‌ 4/17, మెహదీ హసన్‌ 4/48).

జెమిని ఫ్రెండ్స్‌ తొలి ఇన్నింగ్స్‌: 429; ఇండియా సిమెంట్స్‌ తొలి ఇన్నింగ్స్‌: 165 (రతన్‌ తేజ 4/44), రెండో ఇన్నింగ్స్‌: 237 (శ్రేయస్‌ 136; ఎం. రాధాకృష్ణ 4/43, సంకేత్‌ 3/40). 

మరిన్ని వార్తలు