ప్రేమ జంట.. మధ్యలో యువీ!

28 Jul, 2019 16:37 IST|Sakshi

ఒంటారియో: అంతర్జాతీయ క్రికెట్‌కు ఐపీఎల్‌కు ఇటీవల రిటైర్మెంట్‌ ప్రకటించిన తర్వాత యువరాజ్‌ సింగ్‌ గ్లోబల్‌ టీ20 కెనడా లీగ్‌లో ఆడుతున్నాడు. ఈ లీగ్‌లో టోరంటో నేషనల్స్‌ తరఫున ఆడుతున్న యువీ..శనివారం ఎడ్మాంటన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చిలిపిగా ప్రవర్తించాడు. ఇరు జట్ల మధ్య మ్యాచ్‌ జరిగే క్రమంలో వర్షం పడటంతో ఆటకు అంతరాయం ఏర్పడింది.  దాంతో యువరాజ్‌తో సహా మిగతా ఆటగాళ్లంతా తమ తమ వార్మప్‌లో మునిగిపోయారు.(ఇక్కడ చదవండి: యువీ.. వాటే సిక్స్‌)

ఈ సమయంలో ఎడ్మాంటన్‌ తరఫున ఆడుతున్న ఆసీస్‌ క్రికెటర్‌ బెన్‌ కట్టింగ్‌ను న్యూస్‌ ప్రెజంటర్‌ ఎరన్‌ హోలాండ్‌ ఇంటర్యూ చేస్తున్నారు. దీన్ని గమనించిన యువరాజ్‌.. ఆ ఇద్దరి మధ్యకు వచ్చి అంతరాయం కల్గించాడు. అంతటితో ఆగకుండా ‘ మీ పెళ్లి ఎప్పుడు?’ అంటూ వారిని కాస్త ఇబ్బంది పెట్టాడు. దీనికి ఒక్కసారిగా పగలబడి నవ్విన హోలాండ్‌ సమాధానం ఇచ్చే లోపే యువీ అక్కడ్నుంచి జారుకునే యత్నం చేశాడు. వీరిద్దరూ గత నాలుగేళ్లుగా డేటింగ్‌లో ఉండగా, ఇటీవల వీరి నిశ్చితార్థం జరిగింది. త్వరలో పెళ్లి చేసుకోబోతున్న ఈ జంటను యువీ ఆట పట్టేంచబోయాడు.  ఏదో విరామం దొరికింది కదా అని ప్రేమ జంట ముచ్చటించుకుంటుండగా వారి మధ్యలో దూరి ‘కోతి’ వేషాలు వేశాడు యువీ.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా