అబ్దుల్ కలాం మళ్లీ పుట్టాలి

31 Jul, 2015 01:34 IST|Sakshi
అబ్దుల్ కలాం మళ్లీ పుట్టాలి

-అనంతపురం జెడ్పీ చైర్మన్ చమన్
 

బళ్లారి అర్బన్ : మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త, యువతకు స్ఫూర్తిదాత, అన్నింటికి మించి మానవతావాది ఏపీజే అబ్దుల్ కలాం శాశ్వతంగా దూరం కావడంతో యావత్ దేశం శోకసంద్రంలో మునిగిందని, అలాంటి కలాం మళ్లీ పుట్టాలని అనంతపురం జిల్లా పంచాయతీ చైర్మన్ పీ.చమన్ పేర్కొన్నారు. గురువారం ఆయన బళ్లారికి వచ్చిన సందర్భంగా నగర శివార్లలోని గుగ్గరహట్టి పాండురంగ దేవస్థానం సమీపంలోని మున్నాబాయి ఇంటి ముందు ఏర్పాటు చేసిన ఏపీజే అబ్దుల్ కలాం సంతాప సభకు హాజరై మాట్లాడుతూ భరత మాత ముద్దుబిడ్డకు తమిళనాడులోని రామేశ్వరంలో ఘనంగా నివాళులు అర్పించి అంత్యక్రియలు జరిగాయన్నారు.
  ఆయన ఆత్మశాంతి కోసం అందరూ ఐదు నిమిషాలు మౌనం పాటించారు.

కలాం చిత్రపటానికి పూల మాలలు వేసి సెల్యూట్ చేశారు. కుల, మత బేధాలు లేకుండా ప్రతి ఒక్కరు ఆయన సేవలను స్మరించుకున్నారని కొనియాడారు. అబ్దుల్ కలాం అందరి మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. ఈ కార్యక్రమంలో కణేకల్లు ఎంపీపీ ఫకృద్దీన్, బళ్లారి నగర మేయర్ నాగమ్మ చంద్ర, ఉపమేయర్ మాలన్‌బీ, జేడీఎస్ నాయకుడు మున్నాబాయి, ముండ్రిగి నాగరాజు, కార్పొరేటర్లు కెరెకోడప్ప, సూరి, ఉమాదేవి, శివరాజు, రాముడు, శర్మాస్, రసూల్‌సాబ్, సిద్ధప్ప తదితరులు పాల్గొన్నారు.
 
 

>
మరిన్ని వార్తలు