నర్సరీ అడ్మిషన్లలో సమస్యలుంటే కాల్ చెయ్యండి

14 Jan, 2014 00:53 IST|Sakshi
నర్సరీ అడ్మిషన్లలో సమస్యలుంటే కాల్ చెయ్యండి

సాక్షి, న్యూఢిల్లీ : ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలపై ఎలాంటి ఫిర్యాదులు అందితే కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా హెచ్చరించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా తో కలిసి విద్యాశాఖ మంత్రి హెల్ప్‌లైన్ నంబర్‌ను సోమవారం ప్రారంభించారు. ప్రైవేటు పాఠశాల లకు సంబంధించి, ముఖ్యంగా నర్సరీ అడ్మిషన్లలో ఏదైనా ఇబ్బందులు ఎదురైతే తల్లిదండ్రులు వెంట నే 27352525 నంబర్‌కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని వారు పేర్కొన్నారు. హెల్ప్‌లైన్ నంబర్ ప్రారం భం అనంతరం మొదటి కాల్ కేజ్రీవాల్ చేశారు. అయితే నంబర్ చాలాసార్లు బిజీ రావడం గమనార్హం.
 
 నర్సరీలో చిన్నారులను చేర్చుకునేందు కు డొనేషన్లు తీసుకున్నట్టు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలను విద్యాశాఖ మంత్రి మనీష్‌సిసోడియా హెచ్చరించారు. నర్సరీ అడ్మిషన్లకు సంబంధించి అన్ని వార్డులను విధిగా బోర్డుల్లో వెల్లడించాలని ఆయన  సూచించారు.  నర్సరీ అడ్మిషన్‌లలో ఎలాంటి ఇబ్బందులున్నా తల్లిదండ్రులు వెంటనే సంబంధిత విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేయాలన్నారు. ఆ అధికారి నుంచి సరైన స్పందన లేకపోతే ఎడ్యుకేషన్ మినిస్టర్ హెల్ప్‌లైన్ నంబర్‌కి ఫోన్ చేయవచ్చన్నారు. హెల్ప్‌లైన్ నంబర్‌కి వచ్చే ఫిర్యాదులకు సం బంధించి రోజువారీగా నివేదికలు సేకరించనున్నట్టు ఆయన పేర్కొన్నారు.‘హెల్ప్‌లైన్ ఎలా పనిచేస్తుందో పరిశీలించేందుకు నేను కూడా రోజుకు కనీ సం పదిమార్లు కాల్‌చేస్తూ ఉంటా’అని తెలిపారు. ఫిర్యాదులు స్వీకరించేందుకు www.edudel.nic.in,వెబ్‌సైట్‌ను సైతం ప్రారంభించారు.
 
 కేజ్రీవాల్‌కు జెడ్ కేటగిరి భద్రత
 ఘజియాబాద్‌లోని కౌశాంబిలోని గిర్నార్ టవర్ వద్ద అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు జెడ్ కేటగిరి కింద 14 మంది పోలీసులను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నియమించిం ది. ‘సబ్ ఇన్‌స్పెక్టర్ స్థాయి గల ఇద్దరు వ్యక్తిగత భద్రత అధికారులను నియమించాం. వీరికి ఎనిమి ది మంది భద్రత సిబ్బంది సహకరిస్తారు. హెడ్ కానిస్టేబుల్ నేతృత్వంలోని నలుగురు వ్యక్తిగత సిబ్బందితో ఓ ఎస్కార్ట్ వాహనం ఉంటుంద’ని స్థానిక నిఘా విభాగ సర్కిల్ అధికారి కమ్లేశ్ బహదూర తెలిపారు. ఈ నెల ఎనిమిదిన కౌశాంబిలో ఆప్ కార్యాలయంలో హిందూ రక్ష దళ్ కార్యకర్తలు దాడి చేయడంతో ఐదుగురు పోలీసులను కూడా అక్కడ నియమించిన సంగతి తెలిసిందే.
 
 భూషణ్ మీడియా సమావేశానికి అంతరాయం
 నగరంలోని ఇండియా ఉమెన్ ప్రెస్ కార్ప్స్(ఐడబ్ల్యూపీసీ) వద్ద ఆప్ నాయకుడు ప్రశాంత్ భూషణ్ గురువారం నిర్వహించిన మీడియా సమావేశానికి అంతరాయం కలిగింది. నర్మదా బచావో ఆందోళన్ సభ్యులతో కలిసి మాట్లాడేందుకు ఆయన మీడియా ముందుకు వచ్చారు. ఆ సమయంలో హిందూ సేన అధ్యక్షుడు విష్ణు గుప్తాగా పేరు చెప్పుకొని కాన్ఫరె న్స్ రుమ్‌లోకి వచ్చి ప్రశాంత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దేశం నుంచే ప్రశాంత్ భూషణ్‌ను కేజ్రీవాల్ తోసెయ్యాలన్నారు. ఆ వెంటనే ఆప్ కార్యకర్తలు అతడిని బయటకు పంపించివేసి ప్రధాన ద్వారాన్ని మూసివేశారు. అయితే ఆప్ నుంచి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. జమ్మూ, కాశ్మీర్‌లోని సాయుధ దళంపై భూషణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు