ధ్వని కాలుష్య నియంత్రణకు బీఎంసీ చర్యలు

31 Jan, 2015 00:22 IST|Sakshi

 సాక్షి, ముంబై: నగరంలో విపరీతంగా పెరిగిపోయిన ధ్వని కాలుష్య పరిమాణాన్ని అంచనా వేయాలని మహానగర పాలక సంస్థ (బీఎంసీ) నిర్ణయించింది. ఇందుకు గాను నగరంలో 1,200 చోట్ల ధ్వని కాలుష్య స్థాయిని నిర్ధారించే యంత్రాలను అమర్చనుంది. యంత్రాల ద్వారా లభించే గణాంకాలను బట్టి ధ్వని కాలుష్యాన్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని బీఎంసీ భావిస్తోంది.

దీనికోసం బీఎంసీ పరిపాలన విభాగం దాదాపు రూ.77 లక్షలు ఖర్చు చేయనుంది. నగరంలో ధ్వని కాలుష్యం అంశం ఇటీవల బీఎంసీ స్థాయి సమితిలో చర్చకు వచ్చింది. అయితే నగరంలో ధ్వని కాలుష్యం ఏయే ప్రాంతాల్లో, ఏ మేరకు దాని తీవ్రత ఉందన్న విషయమై బీఎంసీ వద్ద వివరాలు లేవు. దీంతో ముందుగా ధ్వని కాలుష్య స్థాయిని అంచనా వేయాలని బీఎంసీ నిర్ణయం తీసుకుంది.

మరిన్ని వార్తలు