దివి ఉప్పెన ఓ దుర్దినం

19 Nov, 2016 21:41 IST|Sakshi
దివి ఉప్పెన ఓ దుర్దినం

అవనిగడ్డ : 1977 ఉప్పెన దివిసీమకు దుర్దినమని ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక గాంధీక్షేత్రంలో శనివారం ఉప్పెన మృతుల సంస్మరణ సభ జరిగింది. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్‌ మాట్లాడుతూ ఉప్పెన అనంతరం దివిసీమ పునరుజ్జీవనానికి దాతల సేవలు మరువలేనివన్నారు. దివిసీమకు రక్షణ కల్పించేందుకు విస్తృతంగా మడ అడవుల పెంపకం, ఇంటింటా చెట్లు పెంచే కార్యక్రమం చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ మండవ బాలవర్థిరావు, కేడీసీసీ డైరెక్టర్‌ ముద్దినేని చంద్రరావు, జెడ్పీటీసీ కొల్లూరి వెంకటేశ్వరరావు, సీనియర్‌ నాయకులు అన్నపరెడ్డి సత్యనారాయణ, నాయకులు మత్తి శ్రీనివాసరావు, బచ్చు వెంకటనాథ్‌, యాసం చిట్టిబాబు, గాజుల మురళీకృష్ణ, పంచకర్ల స్వప్న పాల్గొన్నారు.

వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో..
1977 ఉప్పెన మృతులకు దివిసీమలో పలు పార్టీలకు చెందిన నాయకులు శనివారం ఘనంగా నివాళులర్పించారు.   పలుచోట్ల కొవ్వొత్తులతో నివాళులర్పించగా, మరికొన్నిచోట్ల ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ కన్వీనర్‌ సింహాద్రి రమేష్‌బాబు నేతృత్వంలో నాయకులు పులిగడ్డ పైలాన్‌ వద్ద కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడవకొల్లు నరసింహారావు, జిల్లా కార్యదర్శి రాజనాల మాణిక్యాలరావు, అవనిగడ్డ పట్టణ కన్వీనర్‌ అన్నపరెడ్డి రాందాస్, నాయకులు చింతలపూడి లక్ష్మీనారాయణ, కేజీ నాగేశ్వరరావు, గరికపాటి కృష్ణ, సుదర్శన్, నలుకుర్తి నగధర్, రాకేష్‌ పాల్గొన్నారు. కాంగ్రెస్‌ నియోజకవర్గ కన్వీనర్‌ మత్తి వెంకటేశ్వరరావు నేతృత్వంలో పులిగడ్డ పైలాన్‌ వద్ద నివాళులర్పించారు. కాగా, ఉప్పెన మృతుల ఆత్మకు శాంతి కలగాలని మండల పరిధిలోని కోటగిరిలంక ఆర్‌సీఎం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

మరిన్ని వార్తలు