కుటుంబం ఆత్మహత్యాయత్నం

19 Jun, 2014 23:33 IST|Sakshi
కుటుంబం ఆత్మహత్యాయత్నం

 వేలూరు:స్థల విక్రయంలో మోసం చేసిన వారి నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ ఆటోడ్రైవర్ కుటుంబసభ్యులతో ఎస్పీ కార్యాలయానికి వచ్చి కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కాట్పాడి తారాపడవేడు ఇలంగో వీధికి చెందిన మణిగండన్ ఆటోడ్రైవర్. భార్య రేఖ, కుమారుడు నగేష్, తల్లి పొన్ని.  వీరు గురువారం ఉదయం 11 గ ంటల సమయంలో ఎస్పీ కార్యాలయానికి చేరుకొని తమకు రక్షణ కల్పించాలని నినాదాలు చేశారు. అనంతరం కుటుంబ సభ్యులందరూ వంటిపై కిరోసిన్ పోసుకున్నారు. గమనించిన ఎస్పీ కార్యాలయంలోని పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసుల విచారణలో  కాట్పాడి హౌసింగ్ బోర్డు వెనుక వైపున మణిగండన్‌కు సొంతమైన 50 సెంట్ల స్థలం ఉంది.
 
 ఈ స్థలాన్ని విక్రయించాలని కాట్పాడికి చెందిన కేజీ కుమార్, శరవణన్ తరచూ బెదిరించడంతో స్థలాన్ని వారికి విక్రయించాడు.  పత్రాలు రాసి న అనంతరం రూ.3.5 లక్షల నగదు ఇచ్చారు. మిగిలిన నగదును ఇవ్వాల ని కోరడంతో చంపేస్తామని బెదిరిస్తున్నారన్నారు. దీనిపై విరుదంబట్టు పోలీసులకు ఫిర్యాదు చేస్తే కోర్టులో పరిష్కరించుకోవాలని చెప్పారన్నా రు. పోలీసులకు ఫిర్యాదు చేయడం తో తమను తరచూ బెదిరిస్తున్నారని తమకు రక్షణ కల్పించాలని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు విచారణలో పోలీసులకు తెలిపారు. పోలీసు లు కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని ఎస్పీ విజయకుమార్ విరుదంబట్టు పోలీసులను ఆదేశించారు. మణిగండన్ కుటుంబ సభ్యులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
 

మరిన్ని వార్తలు