నేటి నుంచి వేంకటేశ్వర బ్రహ్మోత్సవాలు

17 Feb, 2014 00:29 IST|Sakshi

పుణే సిటీ, న్యూస్‌లైన్: ఘోర్పడి ప్రాంతంలోని శ్రీ బాలాజీ సేవాట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 17వ తేదీ సోమవారం నుంచి వైభవంగా ప్రారంభించనున్నారు. 21వ తేదీ (శుక్రవారం) వరకు కొనసాగే ఈ ఉత్సవాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ మేరకు నెల రోజుల నుంచే ఏర్పాట్లు ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు. రంగురంగుల విద్యుద్దీపాలతో ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు.

కాగా, సోమవారం సాయంత్రం 4 గంటల కు అంకురార్పణతో కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మంగళవారం ఉదయం 6 గంటలకు ధ్వజారోహణం, పంచాగ్ని యజ్ఞశాల ప్రవేశం, విశేష పూజాహోమాలు నిర్వహించిన అనంతరం సాయంత్రం 5 గంటల నుంచి సర్వభూపాల శోభాయాత్రను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.  అదేవిధంగా బుధవారం ఉదయం 6 గంటలకు సుప్రభాతం, నవగ్రహ, విశేష హోమం నిర్వహించనున్నారు. సాయంత్రం మహాశాంతి హోమం అనంతరం ఐదు గంటల నుంచి శ్రీవారి గరుడ శోభాయాత్రను నిర్వహించనున్నారు. రెండు రోజులపాటు నిర్వహించనున్న స్వామివారి శోభాయాత్ర మంది రం నుంచి ప్రారంభమై నిగిడినగర్, బాలాజీ నగ ర్, శ్రావస్తీటీ, కాలా శంకర్ నగర్ మీదుగా కవాడే రోడ్, భాగ్యశ్రీనగర్, పవర్‌బాగ్ సొసైటీ దాటి మం దిరం వరకు కొనసాగించనున్నారు.

 గురువారం ఉదయం సుప్రభాతం, విశేషహోమం నిర్వహిం చిన తర్వాత మధ్యాహ్నం 12 గంటల నుంచి విచ్చేసిన భక్తులకు మహాప్రసాదం అందించనున్నారు. మధ్యాహ్నం 4 గంటలకు శ్రీవారి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. శ్రీవారి కళ్యాణ వేడుకలను తిలకించేందుకు అధిక సంఖ్య లో భక్తులు పాల్గొననున్నారు. కాగా, 21వ తేదీ శుక్రవారం వసంతోత్సవం, శ్రీ చక్రతీర్థం పూర్ణాహుతి, ధ్వజారోహణం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ట్రస్ట్ అధ్యక్షుడు సావానారాయణ, ఉపాధ్యక్షుడు కె.భాస్కర్‌రెడ్డి, కార్యదర్శి కె.బలరాం కృష్ణ ఒకప్రకటనలో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు