తగ్గని ఎయిడ్స్

1 Dec, 2014 03:12 IST|Sakshi
తగ్గని ఎయిడ్స్

కోలార్ జిల్లాలో ఫలితాలనివ్వని ప్రచారం
 
కోలారు: జిల్లాలో ఎయిడ్స్ రోగుల సంఖ్య తగ్గు ముఖం పట్టడం లేదు. ఎయిడ్స్ వ్యాధిపై జిల్లా ఆరోగ్య శాఖ జిల్లాలో విస్తృతంగా ప్రచారం చేస్తూ కోట్లు ఖర్చు చేస్తున్నా ఏటా ఎయిడ్స్ వ్యాధిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. గత 2014 జనవరి నుంచి అక్టోబర్ వరకు జిల్లాలో 541 మంది హెచ్‌ఐవీ వైరస్ సోకిన వారిని గుర్తించడం జరిగింది. గత సంవత్సరంలో ఎయి డ్స్‌కు బలైన వారి సంఖ్య 97కు చేరింది. దశాబ్ద కాలంలో జిల్లాలో ఎయిడ్స్ వ్యాధికి గురై 855 మంది మరణించారు. హెచ్‌ఐవీ వైరస్ సామాన్యులలో 1.77 శాతం ఉంటే గర్భిణీలలో 0.12 శాతం ఉంది.  కోలారు ఎస్‌ఎన్‌ఆర్ జిల్లాస్పత్రిలో 2002లో మొట్టమొదటి సారిగా ఐసిటిసి కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం జిల్లాలో 14 ఐసిటిసి కేంద్రాలు పని చేస్తున్నాయి. 5 ప్రైవేట్  నర్సింగ్ హోంలలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్ షిప్‌లో భాగంగా ఐసిటిసి కేంద్రాలను నిర్వహిస్తున్నారు. ఐసిటిసి కేంద్రాలలో 2002 నుంచి 2014 అక్టోబర్  వరకు 6186 మందికి హెచ్‌ఐవీ సోకినట్లు గుర్తించారు. ఇందులో 396 మంది గర్భిణీ స్త్రీలు ఉన్నారు.

748 మంది ఎయిడ్స్‌కు బలయ్యా రు. గర్భిణులకు యశస్విని పథకం కింద రిజిష్టరు చేయించి ఉచితంగా వైద్య సేవలను అందిస్తున్నారు. గర్భిణీ స్త్రీలలో హెచ్‌ఐవీ సోకిన వారికి బిడ్డకు వైరస్ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు డ్యాప్కో అధికారి డాక్టర్ నారాయణస్వామి తెలిపారు. ఈ సౌలభ్యం ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలోను ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. ఎయిడ్స్‌ను గుర్తించిన వారిలో 20 నుంచి 35 ఏళ్ల యువకుల్లోనే అధికంగా ఉంది. దీనిని బట్టి హెచ్‌ఐవీ గురించి జరుగుతున్న జాగృతి కార్యక్రమాలు యువకులను  జాగృతం చేయడం లేదని చెప్పవచ్చు. లారీ, ట్రక్కు డ్రైవర్‌లలో వైరస్‌లను అధికంగా గుర్తిస్తున్నారు. కోలారులో పరిశ్రమలు అధికంగా వస్తుం డడం వల్ల ఈ ప్రాంతంలో హెచ్‌ఐవీపై మరింత జాగృ తం చేయాల్సిన అవసరం ఉంది. యువ సముదాయానికి  దీని గురించి విస్తృత అవగాహన కల్పించాల్సి ఉంది. 
http://img.sakshi.net/images/cms/2014-12/81417383692_Unknown.jpg         
 

మరిన్ని వార్తలు