Vyooham Movie: ఆర్జీవీ వ్యూహం.. మూవీ రిలీజ్‌ డేట్‌పై ట్వీట్ వైరల్!

19 Nov, 2023 12:21 IST|Sakshi

టాలీవుడ్ ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కిస్తున్న చిత్రం వ్యూహం. అజ్మ‌ల్, మాన‌స ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమాను దాసరి కిర‌ణ్‌కుమార్ నిర్మించారు. ఈ సినిమా న‌వంబ‌ర్ 10న‌ ప్రేక్ష‌కుల ముందుకు రావాల్సి ఉండగా.. వాయిదా పడిన సంగతి తెలిసిందే. వ్యూహం సినిమా రిలీజ్‌ను ఆపేయాల‌ని టీడీపీ నాయ‌కుడు లోకేష్ సెన్సార్ బోర్డుకు లేఖ రాసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో సినిమా రిలీజ్‌ను మేకర్స్ వాయిదా వేశారు. రివైజింగ్ కమిటీ సినిమా చూసిన తరవాత కొత్త విడుద‌ల తేదీ ప్ర‌క‌టిస్తామని ఆర్జీవీ గతంలోనే చెప్పారు. తాజాగా ఆర్జీవీ ఈ విషయంపై ట్వీట్ చేశారు. వ్యూహం సినిమా త్వరలోనే థియేటర్లలో రిలీజ్ కాబోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సినిమా పోస్టర్‌ను తన ట్విటర్‌లో పంచుకున్నారు. 

ఈ సినిమాపై గతంలోనే ఆర్జీవీ మాట్లాడుతూ.. ప్ర‌ముఖ నాయ‌కుడు, దివంగత మాజీ సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి గారు మ‌ర‌ణించిన‌ప్పుడు ఎవరికి వారు వ్యూహాలు పన్నారు. అందులో నాకు తెలిసినవే వ్యూహం సినిమా ద్వారా చెప్తున్నాను. నేను నమ్మిన దాన్ని సినిమా తీస్తున్నానని రామ్‌గోపాల్ వ‌ర్మ క్లారిటీ ఇచ్చాడు. గతంలో ‘ఉడ్తా పంజాబ్, పద్మావత్‌’ వంటి హిందీ సినిమాలకు కోర్టు ద్వారా రిలీజ్‌ ఆర్డర్‌ తెచ్చుకున్నట్లే మేమూ తెచ్చుకుంటామని.. చట్టపరంగా ఉన్న పద్ధతుల ద్వారా వ్యూహం చిత్రాన్ని రిలీజ్‌ చేసుకుంటామని వెల్లడించారు. 


 

మరిన్ని వార్తలు