జయపురంలో కాంగ్రెస్‌ ఆఫీసుకు తాళాలు

19 Apr, 2018 08:02 IST|Sakshi
తాళాలు వేసి ఉన్న లోపలి గేట్, తలుపులు

జయపురం : జయపురంలో గల జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయం  భవనాలకు తాళాలు వేలాడుతున్నాయి. అయితే తాళాలు ఎవరు వేశారోనని కాంగ్రెస్‌ శ్రేణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.  ప్రతి రోజూ కార్యాలయానికి వచ్చి కూర్చునే పలువురు పార్టీ నేతలు,  కార్యకర్తలు రెండు రోజుల నుంచి   పార్టీ కార్యాలయానికి తాళాలు వేసి ఉండడంతో చూసి షాక్‌ అయ్యారు. ముఖ్యంగా  పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణ చంద్ర నేపక్, ఎస్‌సీ కాంగ్రెస్‌ సెల్‌ జిల్లా  మాజీ అధ్యక్షుడు రామనాయక్, పట్టణ పార్టీ మాజీ అధ్యక్షుడు కాంత పాఢి, ఇటీవల ఏఐసీసీ సభ్యుడిగా నియమితుడైన  రవీంద్ర మహాపాత్రో, రాష్ట్ర కాంగ్రెస్‌ సేవాదళ్‌ చీఫ్‌ బిరెన్‌ మోహన్‌ పట్నాయక్‌ తదితర ముఖ్యలతో పాటు కొంతమంది పార్టీ కార్యకర్తలు  ప్రతిరోజు పార్టీ కార్యాలయంలో కూర్చుని ముచ్చటించుకోవడం పరిపాటి.

అలా గే పార్టీ కార్యాలయానికి వచ్చే వార్తా పత్రికలను చదివేవారు.  వీరి లో ఎక్కువమంది ఎంఎల్‌ఏ గురించే చర్చించుకునే వారు. అయితే  బుధవారం  వారు వచ్చే సరికి కార్యాలయ ప్రధాన గేటుతో పాటు లోపల గేటుకు, కార్యాలయ తలుపులకు తా ళాలు వేసి ఉండడంతో   కంగుతున్నారు. అసలు ఈ కార్యాలయానికి ఎవరు తాళాలు వేశారన్నది చర్చనీయా ంశమైంది. ఈ పని స్థానిక ఎంఎల్‌ఏ తారాప్రసాద్‌ బాహిణీపతి అనుచరులదేనని కొంత మంది అనుమానిస్తున్నారు. అయితే ఇంతవరకు తాళాలు ఎవరు వేశారో వెల్లడి కాలేదు. ఈ పరిణామం జయపురంలో కాంగ్రెస్‌ పార్టీలో విభేదాలకు దర్పణం పడుతోందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. నేటి వరకు కొరాపుట్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీలో ఒకరిద్దరు తప్ప మిగతా వారంతా పార్టీలోనే కొనసాగుతున్నారు. అయితే పార్టీలో విభేదాలు మాత్రం కొనసాగుతున్నాయి.  

మరిన్ని వార్తలు