కోటి మంది పిల్లలకు క్షీరభాగ్యం

2 Aug, 2013 04:34 IST|Sakshi

సాక్షి,  బెంగళూరు: అంగన్‌వాడి పిల్లలతో పాటు ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాల్లో చదువుతున్న విద్యార్థులకు వారానికి మూడుసార్లు ఉచితంగా పాలను అందించే ‘క్షీరభాగ్య’ పథకాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం లాంఛనంగా ప్రారంభించారు. హొసకోటేలోని చెన్నబైరేగౌడ స్టేడియంలో జరిగిన ప్రారంభ కార్యక్రమంలో ఆయనతోపాటు మంత్రులు ఉమాశ్రీ, టి.బి జయచంద్ర తదితరులు పాల్గొన్నారు.
 
 ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ... ‘క్షీరభాగ్య’ పథకం కింద ప్రతి విద్యార్థికి వారానికి మూడు సార్లు 150 మిల్లీలీటర్ల పాలను అందజేయనున్నామన్నారు. కొద్ది రోజుల పాటు పాల పొడిని పాఠశాలలో పాలగా మార్చి విద్యార్థులకు అందజేయనున్నామని భవిష్యత్‌లో ఇదే పరివ ూణంలో నేరుగా పాలనే అందజేయనున్నామన్నారు. పాల వల్ల విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందుతున్నారు. ‘క్షీరభాగ్య’ పథకం కింద పాలను వితరణ చేసే రోజున సుమారు ఏడు లక్షల లీటర్ల పాలు ఖర్చువతుందన్నారు. అదేవిధంగా పథకం అమలు వల్ల ఈ ఏడాది ప్రభుత్వ ఖజానాపై దాదాపు రూ.400 కోట్ల భారం పడనుందని సిద్ధరామయ్య తెలిపారు.
 
 పాలపై ప్రభుత్వం అందజేస్తున్న ప్రోత్సాహక ధనాన్ని రూ.2 నుంచి రూ.4 పెంచడం వల్ల కర్ణాటక పాడి సమాఖ్య (కర్ణాటక మిల్క్ ఫెడరేషన్-కేఎంఎఫ్) రోజుకు పది లక్షల లీటర్ల పాలు ఎక్కువగా వస్తోందన్నారు. ప్రభుత్వం నూతన ంగా ప్రారంభించిన ‘క్షీరభాగ్య’ వల్ల అదనంగా వచ్చి చేరుతున్న పాలకు మార్కెట్ సదుపాయం కూడా కల్పించినట్లయిందని సిద్ధరామయ్య వివరించారు. రాష్ట్రంలోని పాడి రైతులకు ప్రభుత్వం అందజేస్తున్న ప్రోత్సాహక ధనంతో కలిపి  కేఎంఎఫ్ నుంచి ప్రతి రోజూ రూ.13.2 కోట్ల బిల్లులు అందుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

 

కాగా, బెంగళూరు నగరంతోపాటు హుబ్లీ నగరాల్లో మధ్యాహ్న భోజన పథకం తయారీ సరఫరా వ్యవహారాలను చూస్తున్న ఇస్కాన్, అదమ్యచేతన స్వచ్ఛంద సంస్థలు పాల వితరణకు ప్రభుత్వాన్ని కొంత సమయం కోరినందున ప్రస్తుతానికి ఈ రెండు చోట్ల క్షీరభాగ్య అమలు చేయడం లేదని సిద్ధరామయ్య తెలిపారు. మరో పది రోజుల్లోపు ఈ రెండు నగరాల్లో కూడా ‘పథకం’ కింద పిల్లలకు పాలను అందజేస్తామని సిద్ధరామయ్య తెలిపారు. 

మరిన్ని వార్తలు