ప్రేమ జంట ఆత్మహత్య

3 May, 2015 04:05 IST|Sakshi
ప్రేమ జంట ఆత్మహత్య

తిరువొత్తియూరు: అరియలూరు వద్ద శనివారం ఉదయం 2.30 గంటల సమయంలో రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం రాత్రి చెన్నై నుంచి తిరుచ్చికి వెళుతున్న మలైకోటై ఎక్స్‌ప్రెస్ రైలు శనివారం తెల్లవారుజామున రెండు గంటలకు అరియలూరు ఏసీ గేటు వద్ద రైలు వస్తుండగా రైలు పట్టాలపై ఓ యువకుడు, ఓ యువతి నిలబడివున్నారు. వీరినిచూసి దిగ్భ్రాంతి చెందిన ఇంజిన్ డ్రైవర్ వారిని దూరంగా తొలగిపొమ్మని చేయి చూపిస్తూ హెచ్చరించారు. రైలు ప్రేమజంటను ఢీకొంది. ఈ ఘటనలో వారు మృతి చెందారు.  రైలు డ్రైవర్ రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల విచారణలో ప్రేమికుడు సేలం జిల్లా నంగవల్లి గ్రామం గోమతి కాంప్లెక్స్‌కు చెందిన మణికుమారుడు మారిముత్తు (29), కరూర్ జిల్లా అవరం కురిచ్చ పెరియస్వామి కుమార్తె సుగుణ (20) అని తెలిసింది. వీరి ప్రేమను పెద్దలు తిరస్కరించడంతో ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది.
 

మరిన్ని వార్తలు