వరి కొనుగోళ‍్ళపై మంత్రుల సమీక్ష

15 Apr, 2017 12:38 IST|Sakshi
హైదరాబాద్: రాష్ట్రంలో రబీ వరి ధాన్యం కొనుగోళ్లపై అన్ని జిల్లాల అధికారులతో మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, హరీష్‌రావు, ఈటెల రాజేందర్ సచివాలయంలో శనివారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పోచారం మాట్లాడుతూ.. ఈ ఏడాది వేసంగిలో రికార్డు స్థాయిలో వరి పంట సాగయిందన్నారు.
 
సాధారణ విస్తీర్ణం 5.30 లక్షల హెక్టార్లకు గాను ఈ ఏడాది వేసంగిలో 8.68 లక్షల హెక్టార్లలో వరి సాగయిందని తెలిపారు. నీటి యాజమాన్య పద్ధతులు, నిత్యం మానీటరింగ్‌తో ఎకరాకు వరి దిగుబడి భారీగా పెరిగిందన్నారు. రవాణాకు వాహనాలను సమకూర్చుకొని కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని వెంటవెంటనే గోడౌన్లకు తరలించాలని అధికారులను ఆయన ఆదేశించారు.
మరిన్ని వార్తలు