రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసుల జారీ

17 Nov, 2014 22:51 IST|Sakshi

 న్యూఢిల్లీ: అంధులైన ఇద్దరి విద్యార్థులపై జరిగిన లైంగిక దాడిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోవడాన్ని ఎన్‌హెచ్‌ఆర్‌సీ తప్పు పట్టింది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ కమిషనర్‌కు ఎన్‌హెచ్‌ఆర్‌సీ  నోటీసులు జారీ చేసింది.ఈ విషయమై మీడియాలో వచ్చిన కథనాలను జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) సుమోటాగా స్వీకరించింది.  రెండు వారాల్లో సమాధానం చెప్పాలని సాంఘిక సంక్షేమ విభాగం సెక్రటరీ, ఢిల్లీ పోలీస్ కమిషనర్‌ను కోరింది. ఎన్‌హెచ్‌ఆర్‌సీ తెలిపిన వివరాలిలా ఉన్నాయి..  నవంబర్ 14(బాలల దినోత్సవం) 2013న పశ్చిమ ఢిల్లీలోని అమర్ కాలనీలో ఉన్న ఓ అంధుల సంస్థలో ఇద్దరు విద్యార్థులపై లైంగిక దాడి జరిగింది. ఆ ఇద్దరు విద్యార్థులు 3వ తరగతి చదువుకొంటూ ఆ సంస్థ వసతి గృహంలోనే ఉంటున్నారు.
 
 ఈ క్రమంలో వారిని ఉపాధ్యాయుడే లైంగిక దాడికి పాల్పడ్డాడు. కానీ అతడు ఎవరో అంధులైన గుర్తించ లేకపోయారు. కానీ  సహచర విద్యార్థుల సహాయంతో వైస్ ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని స్కూల్ అధికారులు గోప్యంగా ఉంచారు. పోలీసులు సంబంధిత టీచర్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసినప్పటికీ ఎలాంటి ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేయలేదు. ఈ ఘటన సమాచారాన్ని మీడియా ద్వారా ఎన్‌హెచ్‌ఆర్‌సీ తెలుసుకొని పరిశీలించింది. ఇందులో వాస్తవాన్ని గ్రహించింది. బాలల మానవ హక్కులను ఉల్లంఘించిన తీవ్ర సమస్యగా ఎన్‌హెచ్‌ఆర్‌సీ పరిగణించింది. ఈ మేరకు తక్షణమే సమాధానం చెప్పాలని సంబంధిత అధికారులను కోరుతూ, నిర్లక్ష్యంగా వ్యవహరించిన రాష్ట్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు నోటీసులు జారీ చేసినట్లు ఎన్‌హెచ్‌సీ పేర్కొంది.
 

మరిన్ని వార్తలు