Delhi Air Pollution Updates: ఢిల్లీలో మళ్లీ సరి–బేసి విధానం

7 Nov, 2023 06:02 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రజారోగ్యానికి గొడ్డలిపెట్టులా మారిన కాలుష్యాన్ని కట్టడి చేయడానికి ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో మళ్లీ సరి–బేసి విధానాన్ని ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతోంది. ఈ నెల 13 నుంచి 20వ తేదీ వరకూ సరి–బేసి విధానం అమలు చేయనున్నట్లు ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్‌ రాయ్‌ సోమవారం ప్రకటించారు.

నవంబర్‌ 20 తర్వాత ఈ విధానాన్ని పొడిగించే అంశంపై అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వాయు నాణ్యత తగ్గిపోవడం, కాలుష్యం వల్ల చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అందుకే 8వ తరగతి వరకూ ఆన్‌లైన్‌ క్లాస్‌లు నిర్వహించాలని సూచించారు. బోర్డు పరీక్షలకు సిద్ధమయ్యే పది, పన్నెండో  తరగతి విద్యార్థులకు మినహాయింపు ఉంటుందన్నారు.

మరిన్ని వార్తలు