విమానాశ్రయం వద్ద డిష్యుం..డిష్యుం

25 Jan, 2018 10:09 IST|Sakshi

పరస్పరం కొట్టుకున్న ఓలా,ఉబర్‌ ట్యాక్సీ డ్రైవర్లు

దొడ్డబళ్లాపురం: బెంగళూరు సమీపంలోని అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఓలా, ఉబర్‌ ట్యాక్సీ డ్రైవర్లు బాహాబాహి  తలపడ్డారు. దీంతో ఆ ప్రాంతం రణరంగంగా మారింది. వివరాలు.. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో బెంగళూరు నుంచి ఏర్‌పోర్టుకు వస్తున్న ఒక ట్యాక్సీని ఒక కంపెనీ ట్యాక్సీ డ్రైవర్‌ ఓవర్‌టేక్‌ చేసేందుకు యత్నించి వాహనాన్ని స్వల్పంగా ఢీకొట్టాడు. విమానాశ్రయంలో ప్రయాణీకులను దించేసిన ట్యాక్సీ డ్రైవర్లు తమ కంపెనీల ట్యాక్సీ డ్రైవర్లను కూడదీసుకుని పార్కింగ్‌ లాట్‌లో  పరస్పరం దూషించుకుంటూ తన్నుకున్నారు.  విమానాశ్రయం పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిస్థితిని అదుపుచేశారు. ఘటనకు కారణమైన ఇద్దరు   డ్రైవర్లను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు