బెంగళూరు-మైసూరు హైవే దిగ్బంధం

6 Sep, 2016 10:34 IST|Sakshi

బెంగళూరు : తమిళనాడుకు కావేరి జలాలు విడుదల చేయాలన్న సుప్రీం కోర్టు తీర్పుపై కర్ణాటకలో నిరసన వ్యక్తం అవుతోంది. సుప్రీంకోర్టు తీర్పును నిరసనగా కర్ణాటకలో రైతులు మంగళవారం ఆందోళనకు దిగారు. మరోవైపు రైతు సంఘాలు మాండ్యా బంద్కు పిలుపునిచ్చాయి. బంద్లో భాగంగా బెంగళూరు-మైసూరు జాతీయ రహదారిని రైతులు దిగ్బంధించారు. తమిళనాడు నుంచి వచ్చే వాహనాలను రైతులు అడ్డుకున్నారు. ఆందోళనల నేపథ్యంలో పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. మరోవైపు రైతుల ఆందోళన దృష్ట్యా  కృష్ణ రాజసాగర్ డ్యాం, బృందావన్ గార్డెన్స్ ను నాలుగు రోజుల పాటు మూసివేశారు.

తమిళనాడుకు 15 వేల క్యూసెక్కుల కావేరి జలాలు విడుదల చేయాలని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించిన విషయం తెలిసిందే. కావేరి జలాల వివాదంపై  కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఇవాళ అఖిలపక్ష భేటీకి పిలుపునిచ్చారు. కావేరి జలాల విషయమై  ఈ సమావేశంలో చర్చించనున్నారు.

మరిన్ని వార్తలు