చట్నీలో ఎలుక, తాగునీటిలో కప్ప

30 Jan, 2019 11:54 IST|Sakshi
చట్నీలో ఉన్న ఎలుక, తాగునీటి తొట్టిలో ఉన్న కప్ప

కళాశాల క్యాంటిన్‌ నిర్వాకం

అన్నానగర్‌:  చెన్నై సమీపంలో సోమవారం ఓ ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాల క్యాంటిన్‌ ఆహారంలో ఎలుక, తాగునీటి తొట్టెలో కప్ప ఉండడంతో విద్యార్థులు ఆగ్రహించి ఆందోళనకు దిగారు. చెన్నై సమీపం సెమ్మంజేరిలోని ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ ఉంది. ఇక్కడ రాష్ట్రానికి చెందిన విద్యార్థులతో పాటూ ఇతర రాష్ట్రాల విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ స్థితిలో సోమవారం ఆహారం తినేందుకు విద్యార్థులు కళా శాల క్యాంటిన్‌కి వెళ్లారు. అక్కడ గిన్నెలో ఉంచిన కొబ్బరి చట్నీలో ఎలుక ప్రాణాలతో తిరుగుతూ ఉంది. ఇది చూసిన విద్యార్థులు దిగ్భ్రాంతి చెం దారు. అక్కడున్న క్యాంటీన్‌ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. తరువాత అనుమానంతో అక్కడున్న తాగునీటి ట్యాంక్‌ను తెరచి చూడగా అందులో కప్ప ఉంది. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు కళాశాల ఆవరణలో ఆందోళనకు దిగారు. కళాశా ల నిర్వాహకులు వచ్చి విద్యార్థులతో చర్చలు జరి పారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాంటిన్‌ నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని చెప్పడంతో విద్యార్థులు అక్కడినుంచి వెళ్లిపోయారు.

మరిన్ని వార్తలు