నగరి ప్రజల రుణం తీర్చుకోలేనిది

16 May, 2014 23:27 IST|Sakshi
నగరి ప్రజల రుణం తీర్చుకోలేనిది

 నగరి, న్యూస్‌లైన్ : నగరి ప్రజల రుణం తీర్చుకోలేనిదని ఎమ్మెల్యే ఆర్కేరోజా అన్నారు. సార్వత్రిక ఓట్ల లెక్కింపు పూర్తి అయిన అనంతరం చిత్తూరు నుంచి ఆమె నగరికి విచ్చేశారు. విజయానందంతో విచ్చేసిన ఆమెకు మున్సిపల్ పరిధి సత్రవాడ నుంచి నగరి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు అడుగడుగునా హారతులు, దుశ్శాలువలు, పూలహారాలతో స్వాగతం పలికారు. టపాకాయలు, బాణాసంచాలు పేల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. తెలుగుదేశం కంచుకోటగా ఉన్న నగరి నియోజకవర్గం నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె గెలుపొందడం పార్టీ శ్రేణుల ఆనందానికి అవధులు లేకుండా పోయూరుు. చిత్తూరు నుంచి నగరి పట్టణానికి చేరుకునే మార్గంలో సత్రవాడ దుర్గాదేవి ఆలయం, తిరవళ్లువర్ విగ్రహం సమీపం, కరివరదరాజ ఆలయ సమీపం, పాత పంచాయతీ భవనం సమీపం, కరకంఠాపురం, కేవీపీఆర్‌పేట, ఏకాంబరకుప్పం, రైల్వేగేటు, కొత్తపేట,
 
 ఆనంద థియేటర్ సమీపం, బస్టాండు, చావడి వద్ద నాయకులు కార్యకర్తలు వేచి ఉండి ఆమెకు అభినందనలు తెలిపారు. ఆమె మాట్లాడుతూ పదేళ్లపాటు తెలుగుదేశం పార్టీలో పనిచేసి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే పార్టీలోని నాయకులు ఓడించారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నాయకులు, కార్యకర్తలు తన వెన్నంటి ఉండి విజయపథంలో నడి పించారని తెలిపారు. నియోజకవర్గ తొలి మహిళా ఎమ్మెల్యేగా గెలుపొందడం చాలా ఆనందంగా ఉందన్నారు. నగరి ప్రజలు చూపిన ఆదరణ జీవితాంతం మరవలేనిదన్నారు. ఇది నగరి నియోజకవర్గ ప్రజల విజయమన్నారు. వారి తరపున అసెంబ్లీలో సమస్యల పరిష్కారం కోసం తన గొంతు వినిపిస్తానన్నారు.  ఆర్కేరోజా భర్త ఆర్కేసెల్వమణి, మున్సిపల్ మాజీచైర్మన్ కేజేకుమార్, రూరల్ మండల అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు సుబ్రమణ్యం, మున్సిపల్ కౌన్సిలర్లు బీఆర్వీ అయ్యప్పన్, నీలమేఘం, కె.శాంతి, ఎంపీటీసీ సభ్యులు కౌసల్య, పాల్గొన్నారు.
 
 విజయపురంలో
 నగరి ఎమ్మెల్యేగా ఆర్కే రోజా గెలుపొందడంతో విజయపురంలో మండల నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకొన్నారు. ప్రతి గ్రామంలో టపాకాయలు పేల్చి రంగులు చల్లుకున్నారు. పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు డి.లక్ష్మీపతిరాజు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు నగరిలో ఆర్కే రోజాకు ఘనంగా స్వాగతం పలికారు. శాలవలు కప్పి గజ మాలతో ఆమెను సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు  ప్రసాద్, పరందామన్, ఆనంద్, గుణశేఖర్‌రెడ్డి,  రమేష్, అయ్యప్ప, మధు, విమల్, చక్రవర్తిరాజు, సుధాకర్‌రాజు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు