యువతకు మంచి అవకాశం..‘ఆడుదాం ఆంధ్రా’ : మంత్రి రోజా

1 Dec, 2023 18:39 IST|Sakshi

సాక్షి,విజయవాడ : దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఆడుదాం ఆంధ్రా వంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టలేదని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఆడుదాం ఆంధ్రా పేరుతో ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న రాష్ట్రవ్యాప్త క్రీడా టోర్నమెంట్ల వీడియో లాంఛ్ ,బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమంలో శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితో కలిసి రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘ ప్రస్తుతం యువతలో ఫిజికల్ ఫిట్‌నెస్‌ సరిగా ఉండటం లేదు. ఆడుదాం ఆంధ్రా యువతకు మంచి అవకాశం. టోర్ణమెంట్‌లో 12 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ అందిస్తున్నాం’ అని రోజా తెలిపారు.

’100 కోట్ల బడ్జెట్‌తో ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నాం. టోర్ణమెంట్‌లో పాల్గొనేందుకుగాను 72 గంటల్లో 5 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇంతమంచి అవకాశం మళ్లీ వస్తుందో లేదో ...ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలి. కోటి మంది వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకుంటారని భావిస్తున్నాం. ఏపీని ఆటల ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలనేదే సీఎం వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యం. ఆడపిల్లలు కూడా ఉత్సాహంగా పాల్గొనాలి’ అని రోజా కోరారు.  

శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డి మాట్లాడుతూ...

‘రాజకీయ నాయకులు ఎన్నికలప్పుడే వస్తారనే అభిప్రాయం ప్రజల్లో ఉండేది. సీఎం వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి ఏపీలో ఒక ట్రెండ్‌ను సృష్టించారు ప్రభుత్వం ఏర్పడిన దగ్గర్నుంచి ప్రతీ నాయకుడిని నిత్యం జనాల్లో ఉండేలా చూశారు. ఆడుదాం ఆంధ్రా రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద క్రీడా సంబరం. గ్రామీణ స్థాయిలో క్రీడాకారులను ప్రోత్సహించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం’ అని తెలిపారు. 

ఇదీచదవండి..రామోజీ.. విషం కక్కడం కాదు.. చర్చకు రా : మంత్రి మేరుగ

మరిన్ని వార్తలు