నేడు గుంటూరుకు వైఎస్ జగన్

16 Feb, 2017 06:33 IST|Sakshi
నేడు గుంటూరుకు వైఎస్ జగన్

హాజరుకానున్న జగన్‌

సాక్షి, అమరావతి బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదా సాధన అవసరాన్ని చాటి చెప్పడానికి గుంటూరులో గురువారం నిర్వహిస్తున్న ‘యువభేరి’ లో ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాల్గొంటున్నారు. స్థానిక నల్లపాడు రోడ్డులోని మిర్చియార్డు పక్కన, గతంలో ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి అమరణ దీక్ష చేపట్టిన ప్రాంగణంలోనే ఈ సదస్సు నిర్వహిస్తున్నారు.

ఉదయం 9.30 గంటల కు జరిగే ఈ కార్యక్రమంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యార్థులతో ముఖా ముఖి మాట్లాడతారు. ఉదయం 9 గంటలకు హైదరాబాద్‌ నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా గుంటూరులోని నల్లపాడు రోడ్డులో  మిర్చియార్డు సమీపంలో యువ భేరి ప్రాంగణంలో  విద్యార్థులతో ముఖా ముఖి నిర్వహిస్తారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్యర్యంలో ఈ సదస్సు జరుగుతుంది.