కమిషనర్‌కు పురుగుల అన్నం

15 Nov, 2019 09:26 IST|Sakshi

∙మైసూరులో ఓ హోటల్‌ నిర్వాకం

కర్ణాటక, మైసూరు: పర్యాటక రాజధానిగా ప్రసిద్ధి చెందిన రాచనగరిలో కొందరి నిర్వాకం వల్ల చెడ్డపేరు వస్తోంది. భోజనం చేయడానికి హోటల్‌కు వెళ్ళిన మహా నగర పాలికే (కార్పొరేషన్‌) కమిషనర్‌కు హోటల్‌ సిబ్బంది పురుగుల అన్నం వడ్డించడంతో కంగుతిన్నారు. వెంటనే ఆరోగ్య శాఖ అధికారులకు తెలపడంతో వారు వచ్చి పరిశీలన జరిపి హోటల్‌ యజమానికి రూ.30 వేల జరిమానా విధించిన సంఘటన మైసూరు నగరంలో చోటు చెసుకుంది. కమిషనర్‌గీతా గురువారం మధ్యాహ్నం భోజనం చేయడానికి రైల్వేస్టేషన్‌ సమీపంలో ఉన్న ఆనందభవన హోటల్‌కు వెళ్లారు. ఆమె ఆర్డర్‌ ప్రకారం సిబ్బంది భోజనం తీసుకొచ్చారు.  తినబోతుంటే..   ఆమె తినబోతూ చూస్తే భోజనంలో పురుగులు కనిపించాయి. వెంటనే ఈ విషయాన్ని ఆరోగ్య శాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతో హుటాహుటిన వచ్చి భోజనాన్ని పరిశీలించి పురుగులు ఉన్నట్లు తేల్చారు. హోటల్లో ఉన్న అపరిశుభ్రత, కుళ్ళిపోయిన, పురుగులు పట్టిన కూరగాయలను ఉపయోగిస్తున్నట్లు తెలిసింది.

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా