ప్రజాస్వామ్యానికి శ్రేయోదాయకం

5 Dec, 2013 06:07 IST|Sakshi

ముంబై: ఇటీవల ముగిసిన వివిధ రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో యువ ఓటర్లు అత్యధిక సంఖ్యలో పాల్గొనడం అభినందనీయమని గవర్నర్ శంకర నారాయణన్ పేర్కొన్నారు. స్థానిక రవీంద్ర నాట్యమందిర్‌లో బుధవారం జరిగిన   పురస్కార ప్రదాన కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జర్నలిజం, శాసనసభ, న్యాయవ్యవస్థ, పరిపాలనా రంగాలలో తమ సత్తా చాటుకున్న వారికి ఆర్యచాణక్య పురస్కారాలను అందజేశారు. ఈ  సందర్భంగా మాట్లాడుతూ యువత భారీసంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొనడం ప్రజాస్వామ్య వికాసానికి దోహద పడుతుందన్నారు.
 
 గడచిన 66 సంవత్సరాల కాలంలో దేశంలోప్రజాస్వామ్య వ్యవస్థ మరింత బలోపేతమైందన్నారు. పాలనారంగంలోకి యువత అడుగుపెడితే భారత ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత పరిఢవిల్లుతుందన్నారు. కాగా ఈ పురస్కారాలను అందుకున్నవారిలో అమరావతి జిల్లాలోని అచలాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే బచ్చు కడూ, లోక్‌మత్ సంపాదకుడు సురేష్ ద్వాదశివార్,పింప్రి-చించ్వాడ్ మున్సిపల్ కమిషనర్ శ్రీకర్ పరదేశి, అడ్వొకేట్ దారియస్ ఖంబాటా తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో సిక్కిం గవర్నర్ శ్రీనివాస్ పాటిల్, స్పీకర్ దిలీప్‌వాల్సే పాటిల్ తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు