29 మండలాల్లో పెరగనే లేదు

9 Nov, 2016 01:32 IST|Sakshi
29 మండలాల్లో పెరగనే లేదు

20 మీటర్ల దిగువన భూగర్భ జలాలు.. నివేదిక విడుదల
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కురిసిన వర్షాలకు భూగర్భ జల మట్టాలు పెరిగినా 29 మండలాల్లో మాత్రం 20 మీటర్ల దిగువన లభ్యమవు తున్నారుు. ఇందులో మహబూబ్‌నగర్, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లోనే ఐదేసి మండలాల చొప్పున ఉన్నారుు. 10-20 మీటర్ల మధ్య జలాలున్న మండలాలు 101 ఉండగా, వీటిలో మహబూబ్‌నగర్‌లో 14, రంగారెడ్డిలో 11, కామారెడ్డిలో 10 మండలా లున్నారుు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నీటి మట్టాలపై భూగర్భ జల విభాగం నివేదిక మంగళవారం విడుదల చేసింది.

అక్టోబర్‌లో సాధారణ వర్షపాతం 813 మిల్లీమీటర్లు కాగా, రాష్ట్రంలో 23 శాతం అధికంగా 999 మి.మీ. నమోదైనట్లు నివేదికలో పేర్కొంది. కరీంగనర్, ఆదిలా బాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాలో సాధారణ, మిగతా ఆరు జిల్లాలో అధిక వర్ష పాతం నమోదైందని తెలిపింది. హైదరాబా ద్‌లో 39 శాతం , నిజామాబాద్‌లో 33 శాతం అధికంగా వర్షపాతం నమోదైందని.. గతేడాది 11.27 మీటర్ల లోతున నీటి లభ్యతద ఉండగా అక్టోబర్‌లో 7.11 మీటర్లకు చేరిందని వివరించింది. 

మరిన్ని వార్తలు