నా కొడుకును బతికించరూ..

15 Jul, 2019 11:35 IST|Sakshi
ఆయాన్‌ కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతున్న శంకర్, సోని, మహమూద్‌

ఆ బాలుడి వయస్సు తొమ్మిదేళ్లు.. తొడబుట్టిన చెల్లెలితో సరదాగా ఆడుకుంటూ, పాఠశాలకు ఉత్సాహంగా వెళ్లి వస్తుంటాడు. రాగానే తల్లిఒడిలో సేదదీరుతూ ఆనందంగా గడుపుతాడు. కుటుంబ భారాన్ని మోసే తండ్రి పనికిపోయివచ్చిన వెంటనే తన ముద్దుముద్దు మాటలతో పలకరించి అలరిస్తాడు. ఇలా సంతోషంగా సాగుతున్న ఆకుటుంబాన్ని ఓ పిడుగులాంటి వార్త కంటిమీద కునుకులేకుండా చేసింది. హుషారుగా ఉండే తన కుమారుడికి లివర్‌ సమస్య ఉందని తెలిసి ఆ తల్లిదండ్రుల గుండెలు బరువెక్కాయి. రెక్కాడితేగాని డొక్కాడని ఆ కుటుంబానికి చెందిన పసిబాలుడు ఆయాన్‌ దీనగాథపై సాక్షి కథనం. 
– కాజీపేట అర్బన్‌

సాక్షి, వరంగల్‌ : కుమారుడిని బతికుంచుకోవాలని, కన్న కొడుకు లివర్‌ మార్పిడికి తల్లిదండ్రులు పడుతున్న ఆరాటం హృదయాన్ని కలిచివేస్తుంది. కాజీపేట బాపూజీనగర్‌కు చెందిన నిరుపేద ముస్లిం కుటుంబానికి చెందిన షేక్‌ జావేద్, జీనద్‌లకు 9 సంవత్సరాల కుమారుడు షేక్‌ అయాన్, 7 సంవత్సరాల అలీనా ఫిర్దోస్‌ కూతురు ఉన్నారు. ఓ ప్రైవేట్‌ షోరూంలో సేల్స్‌మేన్‌గా జీవనం కొనసాగిస్తున్న షేక్‌ జావేద్‌కు మూడు నెలల క్రితం కుమారుడికి లివర్‌ పాడై ఊహించని దెబ్బ ఎదురయింది. రెండో తరగతి చదువుతున్న తన కుమారుడు ఆడుతూ పాడుతూ చక్కగా చదువుకునేవాడు. కాగా ఒకరోజు అకస్మాత్తుగా కడుపు ఉబ్బిపోవడంతో హన్మకొండలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకుపోగా కామెర్లు వచ్చాయని నిర్ధారించారు. దీంతో కామెర్లు తగ్గేందుకు చికిత్స చేయించారు. కాగా కడుపు ఉబ్బు మాత్రం తగ్గలేదు. దీంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని నీలోఫర్‌కు తీసుకుని వెళ్లగా అక్కడ వైద్యులు లివర్‌ సిరాసిస్‌గా గుర్తించి లివర్‌ మార్పిడి ఒక్కటే మార్గమని తెలిపారు.

దాతల సాయం కోసం ఎదురుచూపులు
నీలోఫర్‌ ఆస్పత్రిలో ఆయాన్‌కు లివర్‌ మార్పిడి చేయాలని, ఇందుకుగాను రూ.25 లక్షల ఖర్చవుతుందని తెలిపారు. ఒక్కసారిగా తల్లిదండ్రులకు ఎం చేయాలో తెలియని అచేతన స్థితికి చేరుకున్నారు. కాగా ఫేస్‌బుక్, వాట్సప్, ట్విట్టర్‌లో తన కుమారుడి ధీనగాథను తండ్రి పోస్ట్‌ చేయగా చెనైలోని రెలా హస్పిటల్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ రూ.20లక్షలు ఆర్థికసాయం అందించేందుకు ముందుకు వచ్చారు. నిరుపేద కుటుంబానికి చెందిన తాను రోజు పనికి వెళ్తేకాని ఇల్లు గడవని పరిస్థితిలో రూ.5 లక్షలు సమకూర్చలేని స్థితి. మరో వైపు కన్నకుమారుడికి తన లివర్‌ను అందించి బతికించుకోవాలనే తండ్రి తపన. దీంతో దాతల సాయం కోసం, అప్పన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు.దాతలు స్పందించిన తన కుమారుడు ఆయాన్‌ను బ్రతికించాలని వేడుకుంటున్నారు.
దాతలు ఆర్థిక సాయాన్ని అందించాల్సిన  అకౌంట్‌ నెంబర్‌....006901565086, ifsc code & icic0002303  సెల్‌ నెంబర్‌..91777 61108 

మరిన్ని వార్తలు