విద్య ద్వారానే అభివృద్ధి: సినీనటి ఆదితిరావు

15 Apr, 2015 18:01 IST|Sakshi

మహబూబ్‌నగర్: విద్య ద్వారానే సమాజం, వ్యక్తి అభివృద్ధి సాధ్యపడుతుందని బాలీవుడ్ నటి ఆదితిరావు హైదరి అన్నారు. ఆమె బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలం పెంజర్ల గ్రామంలో ప్రొక్టర్ అండ్ గాంబుల్ (పీఅండ్‌జీ) సంస్థ నిర్మించిన ‘పీఅండ్‌జీ శిక్ష’ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె బాలికలతో కొద్దిసేపు ముచ్చటించారు. అనంతరం ఆదితీరావు మాట్లాడుతూ పీతెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పీఅండ్‌జీ సంస్థ నిర్వాహకులు ‘పీఅండ్‌జీ శిక్ష’ పేరుతో 12 పాఠశాల భవనాలు నిర్మించి, 3 వేల మంది విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తున్నట్లు వివరించారు.

అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న 330 పాఠశాల్లో 6 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నట్లు తెలిపారు. 'పీఅండ్‌జీ శిక్షణ'కు మరిన్ని నిధులు సమకూర్చేందుకు పీఅండ్‌జీ ఉత్పత్తులను కొనుగోలు చేయాలన్నారు. అలా కొనుగోలు చేయగా వచ్చిన లాభాల్లో నుంచి కొద్దిమొత్తాన్ని పీఅండ్‌జీ నిర్వాహకులు తిరిగి పాఠశాల భవనాల నిర్మాణం, సౌకర్యాల కల్పనకు ఉపయోగించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం బాలిక విద్యను మరింత ప్రోత్సహించ డానికి పీఅండ్‌జీ శిక్షా ముందడుగు వేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయులు, పీఅండ్‌జీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
(కొత్తూరు)

మరిన్ని వార్తలు