ఎంబీసీలోకి మరో 35 కులాలు

27 Jul, 2018 00:55 IST|Sakshi

ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని మోస్ట్‌ బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్‌ (ఎంబీసీ) కేటగిరీలోకి మరో 35 కులాలను చేరుస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు వెలువరించింది. జీవన స్థితిగతులు, సామాజిక నేపథ్యం, సంక్షేమం తదితరాలను దృష్టిలో పెట్టుకొని ఆ కులాలను ఎంబీసీ కేటగిరీ కింద చేర్చినట్లు పేర్కొంది. ఎంబీసీ యాక్ట్‌–2013 కింద వాటిని పరిగణనలోకి తీసుకుంటున్నట్లు ప్రభుత్వ కార్యదర్శి వెంకటేశం ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఈ 35 కులాల్లో బాలసంతి/బాహుపురి, బుడబుక్కల, దాసరి, దొమ్మర, గంగిరెద్దుల, జంగం, జోగి, కాటిపాపల, మొండిబండ/మొండివరు, వంశరాజ్‌/పిచ్చిగుంట్ల, పాముల, పర్ది, పంబలా, పెద్దమ్మవండ్లు/దేవరవండ్లు/ఎల్లమ్మవండ్లు/ముత్యాలమ్మవండ్లు/దమ్మాలి, వీరముష్టి/వీరబద్రీయ, గుడాలా, కంజారా–బట్ట, రెడ్డిక/కెంపర, మొండెపట్ట, నొక్కర్, పర్కిముగ్గుల, యాట, చొపేమరి, కైకడి, జోషినందివాలాస్, మందుల, కునపలి, పట్ర, పాల ఎక్రాయి/ఎకిల/వ్యాకుల/ఎకిరి/నాయినవారు/పాలేగారు/తొలగరి/కావలి/,రాజన్నలా/రాజన్నలు, బుక్కఅయ్యవారు, గొట్రాలా, కస్కిపడి/కస్కిపుడి, సిద్దుల, సికిల్‌గర్‌/సైకల్‌గర్, అనాథలు, తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను ఈ కేటగిరీలో చేర్చారు.  

మరిన్ని వార్తలు