పకడ్బందీ ఏర్పాట్లు

21 Nov, 2018 19:53 IST|Sakshi
మాట్లాడుతున్న ప్రశాంతి

 సమస్యాత్మక కేంద్రాల్లో  సీసీ కెమెరాలు 

134 బస్సుల వినియోగం

కలెక్టర్‌ ప్రశాంతి 

నిర్మల్‌అర్బన్‌: జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ప్రశాంతి పేర్కొన్నారు.  కలెక్టరేట్‌లోని మీడియా సెంటర్‌లో మం గళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో పారదర్శకంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాకు ముగ్గురు కేంద్ర ఎన్నికల పరిశీలకులు వచ్చారని తెలిపారు. ఈవీఎం, వీవీప్యాట్‌లను రాజకీయ పార్టీల సమక్షంలో సరిచూసి సంబంధిత నియోజకవర్గాలకు పంపినట్లు పేర్కొన్నారు. జిల్లాలో 167 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించినట్లు తెలిపారు. ఆయా కేంద్రాల్లో ఆదనపు బలగాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.

అలాగే సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లాలోని ఖానాపూర్‌ నియోజకవర్గంలో కొన్ని మండలాలు మంచిర్యాల, ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లో ఉన్నాయని, అక్కడ శాంతి భద్రతల పర్యవేక్షణ నిరంతరం అక్కడి పోలింగ్‌ అధికారులతో సమీక్షించడం జరుగుతుందన్నారు. మూడు జిల్లాల ఎస్పీల నుంచి నివేదికలు తెప్పించుకుంటున్నామని అన్నారు.  ప్రతీ నియోజకవర్గంలో వెబ్‌కాస్టింగ్‌ చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులను నియమించామని, వీరికి ఆదివారం శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని 18 ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల  సిబ్బంది పోస్టల్‌ బ్యాలెట్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

అన్ని పొలింగ్‌ కేంద్రాల్లో దివ్యాంగుల కోసం వీల్‌చైర్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో 104 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించినట్లు తెలిపారు. వారికి త్వరలోనే శిక్షణ ఇస్తామన్నారు. ఎన్నికల కోసం నియమించిన సిబ్బందిని పోలింగ్‌ కేంద్రాలకు తరలించేందుకు 134 అద్దె బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆమె వెల్లడించారు.  


నియోజకవర్గాల వారీగా ఈవీఎంల పంపిణీ
 

నిర్మల్‌అర్బన్‌: ఎన్నికల్లో వినియోగించే ఈవీ ఎం, వీవీ ప్యాట్‌లను నియోజకవర్గాల వారిగా పంపిణీ చేసినట్లు జేసీ భాస్కర్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌లో గల ఈవీఎం గోదాంలో భద్రపరచిన ఈవీఎం, వీవీ ప్యాట్‌లను మంగళవారం రాజకీయ పార్టీ నాయకుల సమక్షంలో పరిశీలించారు. అనంతరం జేసీ మాట్లాడారు. ఎన్నికల్లో వినియోగించనున్న బ్యాలెట్‌ యూనిట్, కంట్రోల్‌ యూని ట్, వీవీ ప్యాట్‌లను నిర్మల్, ఖానాపూర్, ము«థోల్‌ నియోజకవర్గాల వారీగా పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఖానాపూర్‌ నియోజకవర్గానికి 262 బ్యాలెట్‌ యూనిట్‌లు, 267 కంట్రోల్‌ యూనిట్‌లు, 286 వీవీ ప్యాట్‌లను ఉట్నూర్‌ రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి పంపిణీ చేసినట్లు తెలిపారు.
 

ముథోల్‌ ని యోజకవర్గానికి 301 బ్యాలెట్‌ యూనిట్‌లు, 306 కంట్రోల్‌ యూనిట్‌లు, 328 వీవీ ప్యాట్‌లను భైంసా రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. అలాగే నిర్మల్‌ నియోజకవర్గానికి 271 బ్యాలెట్‌ యూ నిట్‌లు, 276 కంట్రోల్‌ యూనిట్‌లు,  296 వీవీ ప్యాట్‌లను నిర్మల్‌ రిటర్నింగ్‌ అధికారికి అందజేసినట్లు తెలిపారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రతీ ఒక్కరూ సహకరించాలన్నారు. ఆయన వెంట టీఆర్‌ఎస్‌ నాయకులు గండ్రత్‌ రమేష్, సాయి, రాజేష్, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు నారాయణగౌడ్, ఎంఐఎం పార్టీ నాయకులు మజహర్‌ తదితరులున్నారు.  

>
మరిన్ని వార్తలు