నాటికీ, నేటికీ ఆస్తిలో తేడా లేదట!

16 Nov, 2018 19:01 IST|Sakshi
అంజయ్యయాదవ్‌ (షాద్‌నగర్, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి)

సాక్షి, షాద్‌నగర్‌: మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ 2014, 2018లో నామినేషన్‌ దాఖలు చేసిన అఫిడవిట్లలో వెల్లడించిన ఆస్తి వివరాలు ఇలా ఉన్నాయి. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో వెల్లడించిన ఆస్తి వివరాలను చూస్తే నగదు రూ. 50వేలు, ఎస్‌బీఐ సెక్రటేరియట్‌ బ్యాంకులో రూ. 59,300, ఏపీజీవిబీ వెల్‌జర్ల శాఖలో రూ. 1,14,275, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 28,798 రూపాయలు ఉన్నట్టు చూపారు. 2017 మోడల్‌ ఫార్చునర్‌ వాహనం ఉన్నట్టు, దాని  విలువ 33,07,675 రూపాయలు ఉన్నట్టు తెలిపారు. బంగారం విషయానికి వస్తే ఆయన దగ్గర తులం బంగారు ఆభరణాలు, దీని విలువ 30 వేలు, భార్య పేరిట 30 తులాల బంగారం, కేజీ వెండి ఉందని, వీటి విలువ రూ.9లక్షల 50వేలుగా చూపారు.

స్థిరాస్తులు చూస్తే.. ఏక్లాస్‌పేటలో 13.22 గుంటల పొలం ఉందని, దీని మార్కెట్‌ విలువ రూ.35 లక్షలుగా పేర్కొన్నారు. కెనరా బ్యాంకు కేశంపేట బ్రాంచిలో రూ. 7,46,015 రుణం ఉన్నట్టు తెలిపారు. 2014 సంవత్సరంలో నగదు రూ. 2లక్షలు, ఏపీజీవీబీ వెల్‌జర్ల శాఖలో రూ.8,190, ఎస్‌బీఐ షాద్‌నగర్‌ శాఖలో రూ. 647, కెనరా బ్యాంకు కేశంపేట శాఖలో రూ. 3,570.70 ఉన్నట్టు చూపారు. గతంలో, ప్రస్తుతం దాఖలు చేసిన ఆస్తి వివరాల్లో పెద్దగా తేడాలు ఏమిలేవు. ఫార్చునర్‌ వాహనం కొనుగోలు చేయడంతో రూ.33 లక్షలు అధికంగా ఆస్తి ఉన్నట్టు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.     

మరిన్ని వార్తలు