బతుకమ్మ చీరలొచ్చాయ్‌..

2 Sep, 2019 10:38 IST|Sakshi
బతుకమ్మ చీరలు

జిల్లాకు చేరుకున్న 2.5 లక్షలు

ఇండోర్‌ స్టేడియంలో స్టోరేజీ

రెవెన్యూ, డీఆర్డీవో పర్యవేక్షణ

సాక్షి, కరీంనగర్‌: రాష్ట్ర ప్రభుత్వం పేదింటి ఆడపడచులకు బతుకమ్మ కానుకగా అందించే చీరలు జిల్లాకు చేరుకున్నాయి. రెండేళ్లుగా రేషన్‌కార్డు కలిగిన కుటుంబంలోని 18 సంవత్సరాలు నిండిన ఆడపడుచులకు ప్రభుత్వం బతుకమ్మ చీరలు అందిస్తోంది. ఈ ఏడాది కూడా అందించడానికి జిల్లాకు చీరలు సరఫరా చేస్తోంది. జిల్లాలో 3.01 లక్షల రేషన్‌కార్డులు ఉండగా 8.20 లక్షల యూనిట్లు ఉన్నాయి. అంత్యోదయ కార్డులు 11 వేలు, అన్నపూర్ణకార్డులు 102 ఉండగా, రేషన్‌ దుకాణాలు 487 ఉన్నాయి. కార్డు దారుల్లో 18 సంవత్సరాలు పైబడిన మహిళలను గతంలోనే రెవెన్యూ సరఫరాల అధికారులు గుర్తించారు. పట్టణాల్లో మెప్మా, గ్రామాల్లో రేషన్‌ డీలర్ల ద్వారా చీరలు పంపిణీ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

మండలాల వారీగా ఆహార భద్రత కార్డులో మహిళల సంఖ్య..

మండలం పేరు రేషన్‌ దుకాణాలు     18 ఏళ్ల పైబడినవారు
చిగురుమామిడి 27 14,823
చొప్పదండి 34 18,278
ఇల్లందకుంట 17 11,444
గంగాధర 38 18,355
గన్నేరువరం 14 8,099
హుజూరాబాద్‌ 37 23,879
జమ్మికుంట 33 24,077
కరీంనగర్‌ అర్బన్‌ 58 60,522
కరీంనగర్‌ 26 17,825
శంకరపట్నం 27 16,402
కొత్తపల్లి 23 18,597
మానకొండూరు 41 24,469
రామడుగు 30 17,867
సైదాపూర్‌ 25 14,665
తిమ్మాపూర్‌ 29 17,770
వీణవంక 28 17,355
మొత్తం 487 3,24,427

జిల్లాలో రేషన్‌ దుకాణాలవారీగా కార్డుల్లో ఉన్న వివరాల మేరకు మహిళలను గుర్తించనున్నారు. 3.01 లక్షల కార్డులు ఉండగా 3 లక్షలకుపైగా యువతి, మహిళలు ఉన్నారని సమాచారం. సదరు పర్యవేక్షణ బాధ్యతను రెవెన్యూ శాఖకు అప్పగించారు. మండల తహసీల్దార్లు, డీలర్లతో సమావేశం ఏర్పాటు చేసి మహిళలను, యువతులను గుర్తించనున్నారు. జిల్లాలో మొత్తం 3 లక్షల 25 వేలకు పైగా చీరెలు అవసరం ఉండగా ఇప్పటి వరకు 2.50 లక్షలకుపైగా జిల్లాకు చేరుకున్నాయి. మిగతా చీరలు మరో వారం రోజుల్లో రానున్నాయి. అయితే ఈ చీరలను సెప్టెంబర్‌ మధ్య నెల నుంచి పంపిణీ చేయడానికి డీఆర్డీవో అధికారులు కసరత్తు చేస్తున్నారు. సెప్టెంబర్‌ చివరి వారంలో బతుకమ్మ ఉత్సవాలు జరగనున్నాయి. రకరకాల రంగులు, డిజైన్లలో వస్తున్న చీరలను అధికారులు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ మైదానంలోని ఇండోర్‌ స్టేడియం గోదాంలో స్టోర్‌ చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా