‘గద్వాల జిల్లా కేంద్రంలో బీసీ స్టడీ సర్కిల్‌’

28 Oct, 2017 02:14 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గద్వాల జిల్లా కేంద్రంలో బీసీ స్టడీ సర్కిల్‌ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. అలాగే గట్టులో బీసీ బాలికల గురుకుల పాఠశాల కూడా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. శుక్రవారం మంత్రి జోగురామన్నను బీసీ కమిషన్‌ సభ్యుడు ఆంజనేయ గౌడ్‌ కలిశారు. అక్షరాస్యత, ఉపాధి కల్పనలో జిల్లా వెనకబడి ఉన్నందున అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రిని కోరారు. వీటిపై ప్రాధాన్యత క్రమంలో చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. 

మరిన్ని వార్తలు