భువనగిరిని నాగుండెల్లో పెట్టుకుంటా

25 Sep, 2014 03:38 IST|Sakshi
భువనగిరిని నాగుండెల్లో పెట్టుకుంటా

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత  
బంగారు బతుకమ్మ సంబరాలు విజయవంతం
 

 భువనగిరి
 ‘మొదటి రోజునే విజయవంతంగా నిర్వహించిన బంగారు బతుకమ్మ సంబరాలను నా జీవితంలో మరచిపోలేను.. భువనగిరి నా గుండెల్లో నిలిచిపోతుంది’ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో చేపట్టిన బంగారు బతుకమ్మ సంబరాలతో భువనగిరి పట్టణం పూలవనంగా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు  తర్వాత జరిగిన ఈ పండగను తొలిసారిగా భువనగిరిలో ప్రారంభించారు.  గ్రామాల నుంచి బతుకమ్మలతో భారీగా తరలి వచ్చిన మహిళలతో ఎక్కడ చూసినా బతుకమ్మ సందడి కనిపించింది. తొలిరోజు భువనగిరిలో నిర్వహించిన బంగారు బతుకమ్మ సంబరాలు విజయవంతమయ్యాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. బతుకమ్మలతో  బంగారు తెలంగాణను సాధించుకోవడానికి పెద్ద ఎత్తున హాజరైన మహిళా శక్తి నిదర్శనమన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షకు ప్రతి బింబంగా బతుకమ్మ పండగ ఎదిగిందన్నారు. 2008లో తెలంగాణ జాగృతి ఏర్పాటు చేసి బతుకమ్మ పండగను ప్రారంభించామన్నారు. తెలంగాణ బతుకమ్మ పండగను హేళన చేసినవారికి భువనగిరి సభ సమాధానం చెబుతుందన్నారు. విద్యాశాఖమంత్రి జి.జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ  అసమానతలు, ఆకలిచావులు, ఆత్మహత్యలు లేని బంగారు తెలంగాణ నిర్మాణం కోసం సీఎం కేసీఆర్ క ంటున్న కలలకు భువనగిరి బంగారు బతుకమ్మ సభ నిద ర్శనమన్నారు. సుఖశాంతుల కోసం తెలంగాణను పోరాడి సాధించుకున్నామన్నారు.

తెలంగాణ వస్తే ఏమొస్తది అన్న వాళ్లకు భువనగిరిలో జరిగిన బంగారు బతుకమ్మ సంబరాలకు హాజరైన మహిళలను చూస్తే తెలుస్తుందన్నారు. తరతరాలుగా బతుకమ్మ పండగను చేసుకుంటున్నా తెలంగాణ రాష్ర్టం రావడం వల్లే ఇంత పెద్ద ఎత్తున జరుపుకునే అవకాశం ఏర్పడిందన్నారు. ఇంతకాలం చంపుకున్న ఆత్మగౌరవం నిలబెట్టుకున్నామనడానికి, మన సంస్కృతి సంప్రదాయాలను  గౌరవించుకున్నామనడానికి ఇది నిదర్శనమన్నారు. శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ మాట్లాడుతూ బంగారు బతుకమ్మ సంబరాలను ప్రభుత్వం నిర్వహించడం పట్ల కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.  భువ నగిరి ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల సంస్కృతి, అస్తిత్వం ప్రమాదంలో పడినపుడు పుట్టిన ఉద్యమ కెరటం జాగృతి అన్నారు. కవిత ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలు ఉద్యమానికి ఊపిరినిచ్చాయని చెప్పారు.  కలెక్టర్ చిరంజీవులు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ సంబరాలను తొలిసారిగా భువనగిరిలో ప్రభుత్వం నిర్వహించిందన్నారు. తెలంగాణ ప్రజల సుఖ శాంతుల కోసం ప్రభుత్వం పండగను జరుపుతున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలో సంబరాలను పెద్ద ఎత్తున జరుపుకోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ బంగారు బతుకమ్మ సంబరాలకు వచ్చిన మహిళలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మాట్లాడుతూ జాగృతి ద్వారా తెలంగాణ మహిళలందరినీ ఒక్కతాటిపైకి తెచ్చిన కవితకు కృతజ్ఞతలు తెలిపారు. భువనగిరి ఆర్డీఓ నూతి మధుసూదన్ ఆధ్యక్షతన జరిగి ఈ సభలో ఎస్పీ డాక్టర్ ప్రభాకర్‌రావు, జేసీ ప్రీతిమీనా, మునుగోడు, తుంగతుర్తి, నకిరేకల్ ఎమ్మెల్యేలు కె. ప్రభాకర్‌రెడ్డి, గాదరి కిషోర్, వేముల వీరేశం, ఎమ్మెల్సీ పూల రవీందర్, టీఆర్‌ఎస్ వ్యవస్థాపక సభ్యులు ఎలిమినేటి కృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ సుర్వి లావణ్య, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కొలుపుల అమరేందర్, నాగారం అంజయ్య, సిద్దుల పద్మ, బొట్ల పరమేశ్వర్, బిల్డర్ రవికుమార్, పారిశ్రామికవేత్త ఆంటోనిరెడ్డి, డీఎస్పీ ఎస్. శ్రీనివాస్, తహసీల్దార్‌లు కె. వెంక ట్‌రెడ్డి, వీరప్రతాప్, అరుణారెడ్డి పాల్గొన్నారు. వ్యాఖ్యాతగా డాక్టర్ పోరెడ్డి రంగయ్య వ్యవహరించారు.

బతుకమ్మ ఆడిన కవిత

బంగారు బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. భువనగిరి జూనియర్ కళాశాల మైదానంలో ప్రభుత్వం, తెలంగాణజాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన  బంగారు బతుకమ్మ ఉత్సవాలకు పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలతో ఆమె కలిసిపోయారు. వారిని పలకరిస్తూ సంప్రదాయ బద్ధంగా బతుకమ్మ పాటలు పాడుతూ సుమారు గంటసేపు ఆడారు. దీంతో మహిళలు ఆమెను అనుకరించారు. ఆమెతో కలిసి ఆడడానికి మహిళలు ఆసక్తి చూపారు. సభ అనంతరం బతుకమ్మలను నిమజ్జనం చేయడానికి మహిళలతో కలిసి వెళ్లారు. ఆమె వెంట ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునిత, జేసీ ప్రీతిమీనా, పలువురు మహిళా నాయకులు ఉన్నారు.
 
 

మరిన్ని వార్తలు