గల్లిగల్లీలో బీజేపీ  జెండా ఎగరాలి

1 Nov, 2018 10:44 IST|Sakshi
ఆర్మూర్‌లో బూత్‌స్థాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్, అభివాదం చేస్తున్న అభ్యర్థి వినయ్‌ రెడ్డి, పార్టీ నేతలు

పెర్కిట్‌(ఆర్మూర్‌): ఎమ్మెల్యే సీటు గెలవాలంటే ప్రతి పోలింగ్‌ బూత్‌లో బీజేపీ నూటికి నూరు శాతం ఓట్లు సాధించాలనే సంకల్పంతో కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ పిలుపునిచ్చారు. ఆర్మూర్‌ మండలం పెర్కిట్‌ ఎమ్మార్‌ గార్డెన్స్‌లో బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన బూత్‌ స్థాయి కార్యకర్తల ఎన్నికల సన్నాహక సమావేశానికి రాంమాధవ్‌ ముఖ్య అతిథిగా హాజరై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్‌లో బీజేపీ ప్రభంజనం చూస్తుంటే జిల్లా వ్యాప్తంగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ జెండా ఎగుర వేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సేవాభావంతో పని చేసే వారికే బీజేపీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తుందన్నారు. గత రెండున్నరేళ్లుగా ఆర్మూర్‌ నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు చేపడుతున్న బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి వినయ్‌ రెడ్డిని ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.

ఎన్నో ఆకాంక్షలతో ఏర్పాటు చేసుకున్న తెలంగాణలో అవినీతిమయమైన కుటుంబ పాలన సాగుతోందన్నారు. కుటుంబ పాలన ను అంతమొందించడానికి మొదట అసెంబ్లీ ఎన్నికలు తర్వాత పార్లమెంట్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు తగిన బుద్ధి చెప్పాలన్నారు. అంతకుముందు బీజే పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ ప్రభంజనం చూస్తుంటే రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు నూ కలు చెల్లాయన్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ రాకతో కార్యకర్తల్లో నూతన ఉత్తేజం వచ్చిందన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే రైతుల జీవితాలు బాగు పడతాయన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగా రెడ్డి మాట్లాడుతూ పారదర్శక పాలన కోసం తెలంగాణలో బీజేని అధికారంలోకి తీసుకు రావాలన్నారు.

రాష్ట్ర అధికార ప్రతినిధి అల్జాపూర్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ ప్రస్తు తం టీఆర్‌ఎస్‌ పరిస్థితి చూస్తుంటే గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌ గెలవలేని స్థితిలో ఉంటే ఆర్మూర్‌లో జీవన్‌ రెడ్డి ఎలా గెలుస్తాడని ఎద్దేవా చేశారు. ప్రజాధనాన్ని కొల్లగొడుతున్న టీఆర్‌ఎస్‌ నుం చి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన సమ యం ఆసన్నమైందన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధర్మపురి అర్వింద్‌ మా ట్లాడుతూ ఆర్మూర్‌ నియోజకవర్గంలో ని నందిపేట్‌ మండలంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన  సెజ్‌లో స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు ఒక్క ఫ్యాక్టరీని తీసుకు రాలేక పోయారన్నారు. అలాగే ఆర్మూర్‌ పట్టణంలో ఏర్పాటు చేసిన లెదర్‌ ఫ్యాక్టరీ తెరుచుకోవడం లేదన్నారు. బీజేపీ ఆర్మూర్‌ అసెంబ్లీ అభ్యర్థి వినయ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు ఆర్మూర్‌ నియోజకవర్గాన్ని స్థానికేతరులే పాలించారని స్థానికుడైన తనను ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపిస్తే జన్మనిచ్చిన ఆర్మూర్‌ రుణం తీర్చుకుంటానన్నారు.

ఆర్మూర్‌ తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డిని నియోజకవర్గ ప్రజలు తిరస్కరిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో సొమ్ము ఒకరిది సోకు ఒకరిదిగా మారిందన్నారు. కేంద్రం విడుదల చేసిన నిధులతో జరిగిన అభివృద్ధిని తమ ఘనతగా చాటుకుంటున్నారన్నారు. కార్య కర్తలు గడప గడపకు వెళ్లి ప్రజలను చైతన్య పరచాలన్నారు. ఈ సందర్భం గా ఆర్మూర్‌ నియోజకవర్గంలోని పలువురు బీజేపీలో చేరారు. కార్యక్రమం లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బద్దం లింగా రెడ్డి, భూపతి రెడ్డి, సదానంద్‌ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాల శివరాజ్, రాజారం, సుభాష్, నూతుల శ్రీనివాస్‌ రెడ్డి, రుయ్యాడి రాజేశ్వర్, ద్యాగ ఉదయ్, పూజ నరేందర్, పోల్కం వేణు, అమ్దాపూర్‌ రాజేశ్, కొంతం మురళీధర్, భూపేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు